ఫోటో స్టొరీ: బ్లాక్ లో సాహో అనిపిస్తోందే

Update: 2019-08-09 10:02 GMT
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ మొదటిసారిగా 'సాహో' తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. 'సాహో' బహుభాషా చిత్రం అయినప్పటికీ బేసిక్ గా తెలుగు సినిమానే. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటిస్తుండడంతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల్లో పాపులర్ అయింది.  ఇక సినిమా హిట్ అయితే తెలుగువారికి మరింత చేరువ అవుతుందనడంలో సందేహం లేదు.

సాహో సినిమాకోసం కొన్ని అద్భుతమైన లోకేషన్స్ లో షూటింగ్ జరిగిందనే సంగతి తెలిసిందే. 'ఏచోట నువ్వున్నా' పాటను ఆస్ట్రియాలో మంచు కొండల్లో చిత్రీకరణ జరిపారు.  ఈ పాట టీజర్ లో మంచు కొండల్లోనే కాకుండా ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ పై కూడా శ్రద్ధా.. ప్రభాస్ లు కూల్ బాలీవుడ్ స్టైల్ స్టెప్స్ వేస్తారు.  తాజాగా ఈ లొకేషన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను శ్రద్ధ తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో రోప్ బ్రిడ్జ్ పై శ్రద్ధా బ్లాక్ డ్రెస్ లో నిలబడి ఉంటే తన సహాయకులు ఆ పొడవాటి డ్రెస్ ను సరి చేస్తున్నారు.  ఏ చోట నువ్వున్నా సాంగ్ టీజర్ లో 1.16 నిముషాలకు ఈ డ్రెస్ కనిపిస్తుంది.  ఈ డ్రెస్ లో శ్రద్ధ ఒక సూపర్ మోడల్ తరహాలో కనిపిస్తోంది.

శ్రద్ధా షేర్ చేసిన ఈ ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్".. "తుమ్ సచ్ ముచ్ సోని హో".. "క్వీన్ ఆఫ్ హాట్నెస్" అంటూ కామెంట్లు పెట్టారు.  ఈ ఫోటోకు దాదాపు వన్ మిలియన్ లైక్స్ వచ్చాయి.  శ్రద్ధ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'సాహో' ఈ నెల 30 వ తారీఖున రిలీజ్ కానుంది.  ఈ సినిమా కాకుండా 'చిచోరే'.. 'స్ట్రీట్ డ్యాన్సర్' చిత్రాలలో కూడా నటిస్తోంది.


Tags:    

Similar News