బేబీ పాత్రలో సాహో సుందరి?

Update: 2019-06-05 06:01 GMT
బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉంటూ స్టార్ హీరొయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన శ్రద్ధా కపూర్ తెలుగులో సాహో ద్వారా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ఆ రేంజ్ బడ్జెట్ ప్లస్ అంచనాలు ఉన్న మూవీగా ఇంత కన్నా గొప్ప డెబ్యు తనకు దొరికే ఛాన్స్ లేదు. ఏదో హీరో పక్కన ఆడి పాడే రెగ్యులర్ గ్లామర్ పాత్ర కాకుండా అతనితో ధీటుగా పోరాట సన్నివేశాల్లో పాల్గొనే ఆఫీసర్ గా శ్రద్ధకు సాహోలో పెర్ఫార్మన్స్ పరంగా కూడా చాలా స్కోప్ దక్కింది.

ఇది బ్లాక్ బస్టర్ అయితే తనకు ఆఫర్లు వెల్లువెత్తుతాయని ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా సమంతా టైటిల్ రోల్ చేసిన ఓ బేబీ వచ్చే నెల 5న విడుదల కానుంది. ఇప్పటికే టీజర్ కు సూపర్ రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో దీని మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఫైనల్ వెర్షన్ చూసిన నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు మిగిలిన బాషలలోనూ దీన్ని రీమేక్ చేసేందుకు సోలోగా హక్కులు కొనేసుకున్నారట.

ముందుగా హిందిలో తీయాలనే ఉద్దేశంతో ఇప్పటికే శ్రద్ధా కపూర్ తో ఓ రౌండ్ చర్చలు జరిగాయని సమాచారం. రెండు మూడు షోలు కూడా వేసి మరీ ఇతర నిర్మాతల అభిప్రాయం తీసుకున్నారట. శ్రద్ధా సానుకూలంగా ఉన్నప్పటికే చేతిలో ఉన్న కమిట్ మెంట్స్ ని చెక్ చేసుకుని తర్వాత చెబుతానని అన్నట్టు తెలిసింది. ఇంతగా హిందిలో తీయాలనిపించెంత ఎగ్జైట్ మెంట్ ఇచ్చింది అంటే ఓ బేబీలో చాలా విషయమే ఉండాలి. ఇది కనక ఓకే అయితే తెలుగులో సమంతాను అదే పాత్రలో కొన్నాళ్ళ తర్వాత శ్రద్ధ కపూర్ ని చూసుకోవచ్చు
Tags:    

Similar News