ఫోటో స్టొరీ: సాహో అంటున్న శ్రద్ధ

Update: 2018-11-28 04:58 GMT
ఫుడ్ అంటే ఫుడ్డే..! రుచిగా ఉండే ఆహరం వడ్డిస్తే ఎలాంటి మనిషయినా ఫ్లాట్ అయిపోతాడు.  అసలు ఎవరిముందైనా నోరూరించే వంటకాలు పెడితే చాలు.. సాహో అంటాడు. ఇప్పుడు 'సాహో' సెట్స్ లో కూడా అలాంటిదే జరిగింది.  శ్రద్ధ కపూర్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.

ఫోటోలో శ్రద్ధ డైనింగ్ టేబుల్ లాంటి ఒక టేబుల్ ముందు కూర్చుని.. చూడండి ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయో అన్నట్టుగా పోజిచ్చింది. మన తెలుగు వంటలన్నీ కవర్ అయ్యాయి..మొత్తం 23 గిన్నెలు వాటిలో నోరూరించే ఐటెమ్స్ ఉన్నాయి. ఒక్క రైస్ మాత్రం ఆ లిస్టు లో లేదు.  సైజ్ పెద్దగా ఉంది కదా అని ఫోటో ఫ్రేమ్ బయట పెట్టారేమో మరి.  ఈ ఫోటోకు శ్రద్ధ ఇచ్చిన క్యాప్షన్ ఏంటంటే.."కష్టమే.. కానీ షేర్ చేసుకుంటాం"(అంటే.. మొత్తం లాగించాలని మనసులో ఉందేమో).

డార్లింగ్ ప్రభాస్ ఇంటినుండి క్యారేజ్ వస్తే ఆ రుచులకు మతిపోతుందని ఇప్పటికే ప్రభాస్ తో పనిచేసిన వారందరూ చెప్పారు. గతంలో శ్రద్ధ కూడా ప్రభాస్ ఇంటి ఫుడ్ ను టేస్ట్ చేసి దాని గురించి గొప్పగా చెప్పింది. ఇప్పుడు ఈ క్యారేజ్ ఎక్కడినుంచి వచ్చిందనే విషయం చెప్పలేదు గానీ.. ఆ వాలకం చూస్తుంటే మాత్రం డార్లింగ్ ఇంటినుండి వచ్చినట్టే ఉంది.  ఫోటో చూస్తుంటేనే.. సావిత్రమ్మ గెటప్ లో ఘటోత్కచుడి లా మనకి కూడా "హహహ్హ హహ్హహా" అని అన్నీ లాగించాలని అనిపిస్తోంది కదా.  


Tags:    

Similar News