నా ఇంటికి తేలేదు.. వేరే ఇంటికి వెళ్లలేదు

Update: 2017-01-02 11:30 GMT
సెక్సీ లేడీ శ్రద్దా కపూర్ ఇప్పుడు ''ఓకె జాను'' సినిమాతో ఓ రెండు వారాల్లో మన ముందుకు దూసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే సడన్ గా ఎక్కడ చూసినా కూడా ఆమె లివ్ ఇన్ రిలేషన్ గురించి వార్తలు రావడం.. ఇంతలో ఆమె పప్పా శక్తి కపూర్ క్లారిటీలు ఇవ్వడం.. అలాగే ఇప్పుడు ఆమె కూడా రుసరుసలాడటం.. అబ్బో సినిమాకు పిచ్చ పబ్లిసిటీ తెస్తున్నాయి. ఇంతకీ అమ్మడు ఏమంటుందో తెలుసా?

''నాకు ఒక ఇల్లు ఉంది. నేను పుట్టి పెరిగిన ఇంటికి నాక్కోబోయే మొగుడ్ని నేను తీసుకురాలేదు. అలాగే నేను మా అమ్మానాన్నలతో తప్పించి ఎవ్వరితోనూ ఎటువంటి లివ్ ఇన్ రిలేషన్లోనూ లేను. వేరే ఇంటికీ వెళ్లిపోలేదు. నాకు నా సామాన్లు పెట్టుకుని మీటింగులు జరుపుకోవడానికి ఒక ఇల్లు ఉందంతే. ఈ రెండిళ్లూ తప్పించి ఇంకేం లేవు'' అంటూ చెప్పుకొచ్చింది. దర్శకుడు ఫర్హాన్ అక్తర్ తో అమ్మడు ప్రేమలో మునిగితేలుతూ అతడితో లివ్ ఇన్ రిలేషన్లో ఉందంటూ రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే.

మొత్తానికి ప్రతీసారీ ఇలా శ్రద్దా కపూర్ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నప్పుడు మాత్రమే ఇటువంటి రూమర్లు రావడం అనేది కాస్త వింతగానే ఉంటుంది. రూటు మార్చి వేరే పద్దతేదైనా చూసుకో శ్రద్దా!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News