సైనా బ‌యోపిక్ కోసం శ్ర‌ద్ధ‌గా..

Update: 2018-09-19 01:30 GMT
ఒక క్రీడాకారిణి బ‌యోపిక్‌ లో న‌టించ‌డం అంటే దానికి ప్రిప‌రేష‌న్ ఎంతో అవ‌స‌రం. అందునా బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణిగా న‌టించాలంటే అందుకు ప్రాక్టీస్ ఇంపార్టెంట్‌. ఓవైపు వేరే సినిమాల్లో న‌టిస్తూనే ఈ సినిమా కోసం ఎంతో ప్రాక్టీస్ చేసింది శ్ర‌ద్ధా క‌పూర్‌. అస‌లింత‌కీ సైనా పాత్ర గురించి శ్ర‌ద్ధ ఏం చెబుతోంది?

ప్ర‌భాస్ స‌ర‌స‌న సాహో చిత్రంలో న‌టిస్తున్న‌ బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ ప్ర‌స్తుతం ఫోక‌స్‌ ని వేరే వైపు మ‌ర‌ల్చింద‌ని తెలుస్తోంది. సాహోలో త‌న పాత్ర చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఇక‌ సైనా నెహ్వాల్ బ‌యోపిక్ కోసం స‌న్నాహాలు ప్రారంభించింది. ఈ నెలాఖ‌రు నుంచి సెట్స్‌ పైకి వెళ్ల‌నున్నామ‌ని తెలిపింది. ఈ సంద‌ర్భ ంగా త‌న పాత్ర కోసం ఎలా ప్రిపేర‌వుతోందో వెల్ల‌డించింది.

తాజాగా ముంబైలోని ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన శ్ర‌ద్ధా సైనా పాత్ర గురించి మాట్లాడుతూ - సైనా భారతదేశపు యూత్‌ ఐకాన్‌. త‌న‌ జీవితం స్ఫూర్తిదాయకం. అందుకే ఈ బయోపిక్‌ లో నటించడం ఓ సవాల్‌. చాలా రోజుల నుంచి ఈ సినిమా కోసం బ్యాడ్మింటన్‌  నేర్చుకుంటున్నా.. అని తెలిపారు.  శ్ర‌ద్ధా న‌టించిన బత్తిగుల్ మీటర్‌ చాలూ ఈనెల 21న‌ విడుదల కాబోతోంది. స్త్రీ త‌ర‌హాలోనే విజయం సాధిస్తుందని శ్ర‌ద్ధ ఆశాభావం వ్య‌క్తం చేసింది. విద్యుత్‌ సమస్యల నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాకి అందరూ కనెక్ట్‌ అవుతారని అనుకుంటున్నాం అని అన్నారు. శ్ర‌ద్ధా న‌టించిన స్త్రీ 100 కోట్ల క్ల‌బ్‌ లో చేరిన సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News