బాలీవుడ్ హీరోయినే కానీ ప్రభాస్ 'సాహో' లో నటిస్తుండడంతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిపోయింది శ్రద్ధా కపూర్. ఇంకా 'సాహో' రిలీజ్ కాకపోయినా తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకు గుర్తింపు రావడం గొప్ప విషయమే. ఇతర బాలీవుడ్ భామల స్టైల్ లోనే ఈ బ్యూటీ కూడా ఒక ఫిట్ నెస్ ఫ్రీక్. ఏదైనా స్కిప్ చేస్తుంది కానీ కసరత్తులు చేయడం మాత్రం మానదట.
అందుకే శ్రద్ధ ఫిట్నెస్ మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఎక్కువే ఉంటుంది. అందుకే 'సాహో' లో కొన్ని యాక్షన్ స్టంట్స్ ను అవలీలగా చేయగలిగింది. తాజాగా శ్రద్ధకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో శ్రద్ధ జిమ్ నుండి తిరిగి వస్తూ ఉన్నప్పుడు తీసిందట. అందుకే స్పోర్ట్స్ వేర్ లో కనిపిస్తోంది. ఈ ఫోటోలో హైలైట్ ఏంటంటే శ్రద్ధ యాబ్స్. సహజంగా హీరోయిన్లు ఫ్లాట్ స్టమక్ ఉండేందుకు ఇష్టపడతారు కానీ ఇలా హీరోలకు ఉన్నట్టుగా యాబ్స్ కనిపించేలా ఎక్సర్ సైజులు చేయరు. కానీ శ్రద్ధ మాత్రం 'అమ్మాయిలు ఎందులో తక్కువ' అన్నట్టుగా ఎక్సర్ సైజులు ఎడాపెడా చేసిపారేసి ఇలా ఫిట్ గా దర్శనమిచ్చింది.
ఈ ఫోటో చూడగానే కొందరు ఓల్డ్ స్టైల్ తెలుగు జనాలు విమర్శలకు దిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వారికి భామలు ముద్దుగా బొద్దుగా గుండ్రంగా దబ్బపండులా ఉంటే ఇష్టం. అయితే మోడరన్ నెటిజనులకు మాత్రం శ్రద్ధ లుక్ సూపర్ గా నచ్చింది. 'శ్రద్ధ ఫిట్నెస్ పీక్స్' అని ఒకరు.. 'యాబ్స్ గర్ల్' అని మరొకరు.. 'శ్రద్ధ ఫిట్నెస్ కు సాహో' అని ఇంకొకరు కామెంట్స్ పెట్టారు.