సాహో టీమ్ కు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చిన శ్రద్ధ

Update: 2019-01-14 07:06 GMT
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రస్తుతం ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.  తెలుగు.. తమిళ.. హిందీ భాషలలో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల నుండి రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. ఇదిలా ఉంటే శ్రద్ధ ప్రస్తుతం ముంబైలో తన ఇంట్లోనే సంక్రాంతి పండగ జరుపుకుంటోంది.  పండగ సందర్భంగా ప్రభాస్ కు.. ఇతర 'సాహో' టీమ్ మెంబర్స్ కు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిందట

స్వీట్ సర్ప్రైజ్ అంటే.. నిజంగా స్వీట్ల తో సర్ప్రైజే.  మహారాష్ట్ర స్పెషల్ స్వీట్ అయిన తిల్ గుల్ లడ్డూల బాక్సులను సాహో టీమ్ కు పండగ స్పెషల్ గా పంపించిందట.  'సాహో' టీమ్ తో శ్రద్దా కు మొదటి నుంచి మంచి అనుబంధం ఏర్పడింది.  ముఖ్యంగా ప్రభాస్ ఫ్రెండ్లీ నేచర్ తో ఈ ముంబై భామ ఫ్లాట్ అయిపోయింది.  ప్రభాస్ తన ఇంటి నుండి ప్రత్యేకంగా వంటలు చేయించి.. వాటిని షూటింగ్ లొకేషన్ కు తెప్పించి శ్రద్దాకు ట్రీట్ ఇవ్వడంతో ఆమె దిల్ ఖుష్ అయింది.  అప్పట్లో ఆ వంటకాల ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి అభిమానులతో ఆ విషయాన్ని పంచుకుంది.  అందుకే ఇప్పుడు మహారాష్ట్ర ట్రెడిషనల్ స్వీట్లతో 'సాహో' టీమ్ కు సర్ప్రైజ్ ఇచ్చింది.
 
'సాహో' సినిమా విషయానికి వస్తే ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15 న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  'బాహుబలి' ఘన విజయం సాధించిన తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
    

Tags:    

Similar News