'జెర్సీ' బ్యూటీని లైట్ తీసుకుంటున్నారా..?

Update: 2020-12-15 00:30 GMT
తమిళ కన్నడ మలయాళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్.. 'జెర్సీ' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇందులో నాని కి జోడీగా నటించిన శ్రద్ధ.. ప్రియురాలిగా, భార్యగా మెచ్యూరిటీ కలిగిన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత ఆది సాయికుమార్ కి జోడీగా 'జోడి' సినిమాలో నటించింది. ఈ ఏడాది సిద్ధు జొన్నలగడ్డ తో కలిసి 'కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమాలో రొమాన్స్ చేసింది. అయితే ఇతర దక్షిణాది బాషల్లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నా.. శ్రద్ధా శ్రీనాధ్ కి టాలీవుడ్ లో మాత్రం అవకాశాలు పెద్దగా రావడం లేదని తెలుస్తోంది.

శ్రద్ధా ప్రస్తుతం తమిళంలో 'మారా' 'చక్ర' 'కలియుగం' వంటి మూడు చిత్రాల్లో నటిస్తోంది. అలానే కన్నడలో 'గోద్రా' 'రుద్రప్రయాగ' సినిమాల్లో కనిపించనుంది. వీటితోపాటు 'ఆరట్టు' అనే మలయాళ మూవీలో కూడా శ్రద్ధా నటించనుంది. తమిళ కన్నడ మలయాళ చిత్రాల్లో బిజీగా ఉన్నా తెలుగు దర్శక నిర్మాతలు అమ్మడిని లైట్ తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. శ్రద్ధ శ్రీనాధ్ జొన్నలగడ్డ సిద్ధూ తో 'నరుడి బ్రతుకు నటన' అనే చిన్న సినిమాకి కమిట్ అయింది. 'జెర్సీ' సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోతుందనుకున్న శ్రద్ధాకి ఒకటీ అర చిన్న సినిమాలు మాత్రమే వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో పెద్ద ఆఫర్స్ అందుకుంటుందేమో చూడాలి.
Tags:    

Similar News