పారిశుద్య కార్మికురాలి పాత్ర‌లో శ్ర‌ద్ధా శ్రీనాధ్!

Update: 2022-12-04 02:30 GMT
'జెర్సీ' తో  హిట్ అందుకున్న హాట్ బ్యూటీ శ్ర‌ద్ధా శ్రీనాద్ టాలీవుడ్ కి సుప‌రిచిత‌మే. డెబ్యూ మూవీతోనే బెస్ట్ పెర్పార్మ‌ర్ అని నిరూపించుకుంది. నేచుర‌ల్ స్టార్ నాని తో రొమాంటిక్ స‌న్నివేశాల్లో సైతం ఆక‌ట్టుకుంది. దీంతో  అమ్మ‌డు ఏ జాన‌ర్ సినిమాకైనా న్యాయం చేయ‌గ‌ల నటి అన్న‌విష‌యం త్వ‌రగానే అర్ధ‌మైంది. కానీ అమ్మ‌డి కెరీర్ ఇక్క‌డ ఆశించిన విధంగా సాగ‌లేదు.

అందం..అభిన‌యం..ప్ర‌తిభ ఉన్న వాటికి త‌గ్గ అవ‌కాశాలు రాలేదు. 'జెర్సీ' త‌ర్వాత 'కృష్ణా అండ్ హిజ్ లీల‌'..'జోడీ' చిత్రాల్లో న‌టించింది. ఆ త‌ర్వాత సొగ‌స‌రి టాలీవుడ్ లో క‌నిపించ‌లేదు. అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో మ‌ళ్లీ త‌మిళ్..క‌న్న‌డ‌..మ‌ల‌యాళం సినిమాల్లో త‌ల మున‌క‌లైంది. ఈ నేప‌థ్యంలో సంచ‌ల‌న పాత్ర చేస్తున్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

ప్ర‌స్తుతం కోలీవుడ్ లో 'విట్ నెస్' అనే సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో  అమ్మ‌డు పారుశుద్య కార్మికురాలి పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ పాత్ర ఛాయిస్  వెనుక బ‌ల‌మైన  కంటెంట్ ఉంద‌ని తెలుస్తోంది. పార్తీబ‌న్ అనే కుర్రాడు ఓ అపార్ట్ మెంట్ లో సెప్టిక్ ట్యాంక్  క్లీన్ చేస్తూ మ‌ర‌ణించాడు. ఆ కుర్రాడి మ‌ర‌ణానంత‌రం అత‌ని త‌ల్లిదండ్రులు  న్యాయ పోరాటానికి దిగుతారు.

ఈ పోరాటంలో వాళ్లు గెలిచారా?  పారుశుద్య కార్మికుల పాత్ర  స‌మాజంలో ఎలా ఉంటుంది?  ఒక్క రోజు రోడ్లు ఊడ‌వ‌క‌పోతే పరిస్థితి ఎలా ఉంటుంది వంటి సామాజిక  అంశాల్ని  ఆధారంగా చేసుకుని తెరెకెక్కిస్తున్నారు.  పారిశుద్య కార్మికుల క‌ష్టాన్ని తెర‌పైకి తెచ్చే  సినిమాగా మ‌లుస్తున్నారు.  పాత్ర బ‌లంగా ఉండ‌టంతో శ్ర‌ద్దా శ్రీనాథ్ ఎలాంటి మొహ‌మాటం లేకుండా ఒకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని ద‌క్షిణాదిన  అన్ని భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. అటుపై హిందీలో కూడా రిలీజ్ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.  మ‌రి సినిమాలో శ్రద్ధా శ్రీనాధ్ న‌ట‌న ఎలా ఉంటుందో చూడాలి.  ఆమె న‌టించిన  సినిమా తెలుగులో రిలీజ్ అయి చాలా కాల‌మ‌వుతోంది. ఇందులో సీనియ‌ర్ న‌టి రోహిణి కూడా పారిశుద్య కార్మికురాలి పాత్ర పోషించిన‌ట్లు తెలుస్తోంది. ఆమె మీడియా ముందుకు కూడా అలాంటి ఆహార్యంలో రావ‌డం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News