అనసూయ భరద్వాజ్ తెలుగు బుల్లితెర ప్రపంచంలో ప్రముఖ యాంకర్. పెద్ద తెరపై సహాయ పాత్రలతోనూ ఆకట్టుకుంటోంది. రంగస్థలం- పుష్ప వంటి బ్లాక్ బస్టర్లలో కీలక పాత్రల్లో నటించిన అనసూయ టాలీవుడ్ లో క్షణం తీరిక లేనంత బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టు. రోజుకు లక్షల్లో పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్న నటిగా పాపులరయ్యారు.
సోషల్ మీడియాలలో అనసూయకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. లక్షల్లో అనుచరులున్నారు. అయితే ఇదే వేదికపై ట్రోలింగ్ కల్చర్ భారిన పడి అనసూయ చాలా సందర్భాలలో ఎమోషనల్ అవుతున్న సంగతి చూస్తున్నదే. ఇటీవల ఆంటీ ఆంటీ అంటూ ట్విట్టర్ లో అనసూయను ఆటపట్టిస్తుండడం చర్చగా మారింది.
నిన్న ఆమె ఒక హీరో అభిమానులను ఉర్రూతలూగించే ట్వీట్ ను షేర్ చేసింది. అప్పటి నుంచి యాంకర్ కం నటి ఆన్ లైన్ లో సెటైర్లను.. ఘాటైన కామెంట్లను ఫేస్ చేస్తోంది. కొందరు ఆమెను ఆంటీ అని పిలిచారు.. 'హ్యాష్ ట్యాగ్ ఆంటీ' (#ఆంటీ)ని ట్రెండ్ చేయడం ప్రారంభించారు.
అనసూయ దానిని విడిచి పెట్టక ట్రోలర్ లను వారి అనుచిత వ్యాఖ్యలకు స్పందిస్తూ నిందించారు. ఆన్ లైన్ దుర్వినియోగానికి నో చెప్పండి! అనే హ్యాష్ ట్యాగ్ తో అనసూయ రివర్స్ కౌంటర్ కి తెర తీసింది. వయస్సును ఉదహరిస్తూ అవమానించడం తన మానసిక ఆరోగ్యానికి ప్రశాంతతకు ముప్పు కలిగిస్తోందని ఆమె పేర్కొంది. దీంతో గొడవ మరింత రచ్చవుతోంది. అయితే ఇంతలోనే ఆర్య 2 బ్యూటీ శ్రద్ధాదాస్ యాంకర్ కం నటి అనసూయకు మద్దతుగా నిలిచింది.
అనసూయ తన వయస్సులో సగం మంది మహిళల కంటే చిన్నదిగా కనిపిస్తోందని .. ఆమె అద్భుతమైన యువతి అని.. హాట్ బ్యూటీ అని శ్రద్ధా దాస్ మెసేజ్ చేసింది. శ్రద్ధా ఉదారమైన ప్రశంసలకు మద్ధతుకు అనసూయ ధన్యవాదాలు తెలిపింది.
కానీ ఇంతలోనే సీన్ రివర్సయ్యింది. ఎరక్కపోయి శ్రద్ధా కూడా ఇందులో ఇరుక్కుపోయింది. అనసూయను మెచ్చుకున్నందుకు కొద్దిమంది శ్రద్ధను దుర్భాషలాడడం మొదలుపెట్టారు. కానీ శ్రద్ధా దీనికి ధీటైన జవాబిచ్చింది. తనను ట్రోల్ చేస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దని త్వరగా కోలుకోవాలని శ్రద్దా నెటిజన్లను కోరింది. ప్రస్తుతం ట్విట్టర్ లో ఇది ఆసక్తికర డిబేట్ గా మారింది.