శ్రీయ ప్రధాన పాత్రలో ఇళయరాజా సంగీత సారథ్యంలో పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తోన్న చిత్రం `మ్యూజిక్ స్కూల్`. ఇందులో శ్రియ మ్యూజిక్ స్కూల్ టీచర్ పాత్రలో కనిపించనుంది. తెలుగు-హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మంచి కంటెంట్ బేస్డ్ సినిమా కావడం ఇళయరాజా లాంటి సంగీతం దిగ్గజం పనిచేయడంతో సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రఖ్యాత గాయకుడు షాన్ కూడా భాగమయ్యారు. ఇందులో షాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన నటుడిగా...గాయకుడిగా కనిపించనున్నారు. షాన్ పాత్ర మాత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తోంది.
ఇందులో షాన్ శ్రియ ఎక్స్ బోయ్ ప్రెండ్ పాత్రలో కనిపించనున్నాడు. శ్రియ గతం ఎక్కువగా ఆయన పాత్ర చుట్టూనే తిరిగుతుందిట. అలాగే ఇళయరాజా కంపోజ్ చేసిన ట్యూన్ కు షాన్ గాత్రం కూడా అందించడంతో సినిమాకు మరింత కలిసొచ్చే అంశంగా మారింది. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్తయింది. హైదరాబాద్..గోవా తదితర ప్రదేశాల్లో కీలక సన్నివేశౄలు చిత్రీకరించారు. తాజాగా యూనిట్ మూడవ షెడ్యూల్ ని కూడా ప్రారంభించారు. బుధవారం నుంచి నిరవధికంగా మూడవ షెడ్యూల్ జరుగుతుందని సమాచారం.
ఇందులో ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దీంతో చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. బ్యాలెన్స్ పనులు కూడా పూర్తిచేసి వీలైనంత త్వరగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
పాపారావు న్యూయార్క్ ఫిల్మ్ ఇనిస్ట్యూట్ విద్యార్ధి. గతంలో `విల్లింగ్ టు త్యాగం` అనే ఓ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఇది జాతీయ..రెండు అంతర్జాతీయ అవార్డుల్ని సైతం అందుకుంది. ఇందులో బాలీవుడ్ నటుడు శర్మాన్ జోషి కూడా నటిస్తున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్..బ్రహ్మానందం వినయ్ వర్మ...గ్రేసీ గోస్వామి.. సుహాసిని ములాయ్.. ఓజు బారు తదిరతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.