అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ''పుష్ప''. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రీసెంటుగా వచ్చిన ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకుంటోంది.
'పుష్ప: రైజ్' హిందీ వెర్షన్ ట్రైలర్ ను ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ చేశారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ చేతుల మీదుగా లాంచ్ చేయబడిన ఈ ట్రైలర్ కు ఉత్తరాది ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్ ఊర మాస్ గెటప్ - పాత్ర తీరుతెన్నులు - యాక్షన్ సీన్స్ వారిని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అలానే హిందీలో అల్లు అర్జున్ పాత్రకు డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది. అక్కడ బన్నీకి వాయిస్ ఇచ్చింది బాలీవుడ్ హీరో శ్రేయస్ తల్పాడే. 'పుష్ప' హిందీ ట్రైలర్ విడుదల సందర్భంగా శ్రేయాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇండియాలోనే మోస్ట్ పవర్ ఫుల్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి డబ్బింగ్ చెప్పినందుకు సంతోషంగా గౌరవంగా ఉందని హిందీ నటుడు ట్వీట్ చేశాడు.
హిందీ మరాఠీ చిత్రాలలో నటిస్తున్న శ్రేయాస్.. 'ఇక్బాల్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే క్రమంలో 'ఓం శాంతి ఓం' 'గోల్ మాల్ రిటర్న్స్' 'గోల్ మాల్ 3' 'గోల్ మాల్ ఎగైన్' 'హౌస్ ఫుల్ 2' వంటి పలు చిత్రాల్లో అలరించారు. ఇటీవల 'లయన్ కింగ్' మూవీ హిందీ వెర్షన్ కు డబ్బింగ్ చెప్పిన శ్రేయాస్.. 'పుష్ప' తో తొలిసారిగా తెలుగు సినిమాకు డబ్బింగ్ చెప్తున్నాడు.
'పుష్ప: ది రైజ్' సినిమా హిందీ రైట్స్ ను గోల్డ్ మైన్ టెలీ ఫిలిమ్స్ సొంతం చేసుకుంది. తెలుగు డబ్బింగ్ చిత్రాలను హిందీలో డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేసే ఈ సంస్థ.. అల్లు అర్జున్ సినిమాని కూడా అలానే విడుదల చేస్తామని మెలిక పెట్టింది. నిర్మాతలు చర్చలు జరిపిన తర్వాత ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏఏ ఫిలిమ్స్ తో కలిసి థియేట్రికల్ రిలీజ్ కు మొగ్గు చూపారు.
ఈ క్రమంలో 'పుష్ప' హిందీ వెర్షన్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు అర్థం అవుతోంది. అందుకే రెగ్యులర్ డబ్బింగ్ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పించకుండా.. శ్రేయస్ వంటి హీరోతో అల్లు అర్జున్ కు వాయిస్ ఇప్పించారు. 'అల వైకుంఠపురములో' చిత్రంతో నార్త్ లో కూడా క్రేజ్ ఏర్పరచుకున్న బన్నీ.. ఇప్పుడు 'పుష్ప' సినిమాతో నేషనల్ వైడ్ సత్తా చాటుతారేమో చూడాలి.
'పుష్ప' చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. సమంత స్పెషల్ సాంగ్ చేస్తోంది. వీరిద్దరూ ఉత్తరాది ప్రేక్షకులకు తెలిసిన మొహాలే అవడం ఈ సినిమాకు కలిసి రానుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం కూడా వారికి పరిచయమే. అందుకే డిసెంబర్ 17న అన్ని దక్షిణాదితో పాటుగా హిందీలోనూ గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.