వీడియో: బాల్కనీ డ్యాన్స్ కేరాఫ్ బార్సిలోనా

Update: 2019-09-09 10:01 GMT
నవ్వు నాలుగు విధాల చేటు అని ఒకరంటారు.. నవ్వడం భోగం అని మరొకరంటారు.  ఏది కరెక్ట్..? రెండూ కరెక్టే.  నవ్వడం భోగమే కానీ సమయం సందర్భం లేకుండా నవ్వడం సరికాదు.  పరామర్శకు వెళ్లి మనం జబర్దస్త్ జడ్జిల్లా నవ్వకూడదు. అదే మనం పార్టీలో ఉన్నామనుకోండి.. జబర్దస్త్ జడ్జిల్లా ఎంచక్కా నవ్వొచ్చు.  మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూలా కూడా ఇకఇకా పకపకా నవ్వొచ్చు.  'నవ్వడం ఒక భోగం' లాగా జీవితాన్ని ఎంజాయ్ చేయడం మహాభోగం.  ఆ విషయం శ్రియకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు.

శ్రియ ప్రస్తుతం తన ప్రియమైన భర్త ఆండ్రీ కోస్చీవ్ తో స్పెయిన్ వెకేషన్ లో ఉంది.  స్పెయిన్ లోని బార్సెలోనా నగరంలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంది.  సోషల్ మీడియాలో యాక్టివ్ కావడంతో ఆ అప్డేట్లను నెటిజన్లతో పంచుకుంటూ.. అందరినీ థ్రిల్ చేస్తూ ఉంది.  తాజాగా శ్రియ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "బార్సిలోనా లో మరో వాన పడుతున్న రోజు" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  అంటే ఈమధ్య రోజూ అక్కడ వాన పడుతుందేమో!  ఇంతకీ వీడియోలో శ్రియ ఏం చేస్తుందయ్యా అంటే.. తన హోటల్ బాల్కనీలో నిలుచుని తన్మయత్వంలో నాట్యం చేస్తూ ఉంది. ఏదో తోచినట్టు చిందులేసే హీరోయిన్లలా కాకుండా శ్రియ ప్రొఫెషనల్ డ్యాన్సర్ అని అందరికీ తెలిసిందే.  నేపథ్యంలో ఒక పాట ప్లే అవుతుంటే.. బైట వాన పడుతుంటే ఒక రిథమ్ లో నాట్యం చేసింది. ఫేస్ లో ఆ హ్యాపీనెస్ మామూలుగా లేదు.  స్వర్గంలో ఉండే నర్తకి రంభగా పూర్తిగా మారిపోయిన శ్రియలా ఉంది.  వంగపండు రంగు టాప్.. అదే రంగులో ఉన్న పొట్టి నిక్కరుతో డ్యాన్స్ చేస్తూ ఉంటే భర్త ఆండ్రీ వీడియో తీసినట్టుగా ఉన్నాడు.

ఈ డ్యాన్స్ వీడియోకు రెస్పాన్స్ అదిరిపోయింది.  "బ్యూటిఫుల్ బాల్కనీ డ్యాన్స్".. "స్పైసీ డ్యాన్స్ ఇన్ బాల్కనీ".. "రెయిన్ డ్యాన్స్" అంతో కామెంట్లు పెట్టారు.  ఇక శ్రియ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం హిందీలో 'తడ్కా' లో నటిస్తోంది.. తమిళంలో 'నరకాసురన్'.. 'సండకారి' అనే టైటిల్స్ తో తెరకెక్కే రెండు సినిమాలలో నటిస్తోంది.  తెలుగులో కూడా ఒక అన్ టైటిల్డ్ ఫిలిం లో నటిస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News