మళ్ళీ పిల్లల తల్లిగా శ్రియ

Update: 2018-02-14 04:31 GMT
విక్టరీ వెంకటేష్ ముఖానికి మేకప్ వేసుకుని చాలా కాలమైంది. చివరగా ఆయన నటించిన సినిమా గురు. హిందీ మూవీ సాలా ఖడూస్ కు రీమేక్ గా వచ్చిన ఇందులో బాక్సింగ్ కోచ్ గా కనిపించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదని అనిపించుకుంది. దాని తరవాత  ఏం చేయాలన్న దానిపై వెంకటేష్ చాలాకాలం పాటు నిర్ణయం తీసుకోలేదు.

వెంకటేష్ ఫ్యామిలీ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ లో డైరెక్టర్ తేజ తీసిన నేనే రాజు.. నేనే మంత్రి సినిమా తరవాత అతడి డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. కానీ ఈ సినిమాకు హీరోయిన్ గా ఎవరు తీసుకోవాలన్న దానిపై చాలా రోజులుగా కుస్తీ పడుతున్నారు. ముందు కాజల్ ను తీసుకోవాలని అనుకున్నారు. ఆ తరవాత ఇందులో హీరోయిన్ ది నటనకు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో నిత్య మీనన్ ని తీసుకుందామని అనుకున్నారు. కానీ అదీ సెట్టవలేదు. ఆ తరవాత బాలీవుడ్ భామ.. చెలియా ఫేం అదితీరావ్ హైదరీ పేరు తెరపై కొచ్చింది. కానీ ఆమె డేట్లు అడ్జస్ట్ కావడం లేదంటూ కాదనేసింది. దీంతో చివరకు ప్రస్తుతం సీనియర్ హీరోలకు చివరి ఆప్షన్ గా ఉంటున్న శ్రియను ఫైనల్ చేశారు.

వెంకటేష్ - శ్రియ ఇంతకుముందు గోపాల గోపాల సినిమాలో కలిసి నటించారు. అందులోనే పదేళ్ల కొడుకుకు తల్లిగా ఆమె నటించింది. అందులో ఆమె పాత్ర కూడా పెద్గ చెప్పుకోదగిందేమీ కాదు. అలాంటిది ఇప్పుడు కూడా అదే తరహా పిల్లల తల్లి పాత్ర అవడంతో ఎప్పటిలాగే నో చెప్పకుండా కాదనేసింది.
Tags:    

Similar News