మార్చి 19న పెళ్ళి పీటలెక్కుతున్న శ్రీయ

Update: 2018-02-27 10:10 GMT
ఈమధ్య కాలంలో ఒక్క హీరోయిన్ కూడా చెప్పి పెళ్లి చేసుకోవట్లేదు. మొన్నటికి మొన్న ఇలియానా ఇన్ స్టాగ్రామ్ లో హబ్బీ అంటూ ఇంట్రడ్యూస్ చేసిందే తప్ప పెళ్ళయిందన్న కబురు కూడా మన చెవిన వేయలేదు. చూస్తూ ఉంటే ఈ జాబితాలో తన పేరు నమోదు చేసుకోబోతోంది శ్రియ. దాదాపు 18 సంవత్సరాలుగా ఇండస్ట్రీ లో ఉంటున్న ఈ 35 ఏళ్ల సుందరి త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఫిల్మ్ నగర్ కోడై కూస్తోంది.

అందరూ హీరోయిన్స్ లాగా శ్రియ కూడా ఎవరో హీరో నో లేదా ఒక బిజినెస్ మ్యాన్ నో పెళ్లి చేసుకోబోతోందా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఈమె చేసుకోబోతోంది ఒక రష్యా దేశ స్పోర్ట్స్ పర్సన్ ని. మార్చి 17 - 18 - 19 వ తేదీల్లో ఈమె మూడు రోజుల చేసుకుంటుంది అని విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం. ఇది నిజమేనా అని అడిగితే మాత్రం అవుననో కాదనో చెప్పకుండా అడిగిన మీడియా పై విరుచుకు పడింది ఈ సుందరి. ''నా జీవితంలో బోలెడు ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. అందుకే నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడకుందాం. నా ప్రైవేట్ లైఫ్ ని నేను సేల్ కి పెట్టలేదు. నేను ఒక యాక్టర్ ని. కాబట్టి నేను సినిమాల గురించి మాట్లాడటానికి మాత్రమే ఇక్కడ ఉన్నాను" అంటూ అక్కడి వాళ్ళకి చాలా గట్టి సమాధానం ఇచ్చింది.  

"మార్చి 17 -18 -19 లో రష్యన్ స్పోర్ట్స్ మాన్ ఆండ్రీ కోస్చీవ్ తో శ్రీయ ఉదయిపూర్ లో మూడు రోజుల పెళ్లి చేసుకుంటోంది. 19న వివాహం జరుగుతుంది. అరెంజ్మెంట్స్ అన్ని చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. హొలీ థీమ్ తో హిందూ సంప్రదాయాల ప్రకారం ఇద్దరూ ఒకటవ్వబోతున్నారు అని శ్రీయ ఇప్పటికే కాబోయే అత్త మామలని రష్యా వెళ్లి కలిసి వచ్చింది" అని శ్రీయ కి దగ్గరివారు మీడియా కి విషయం లీక్ చేశారు అని టాక్  మరి చూద్దాం ఇందులో నిజా నిజాలు ఎప్పుడు తేలతాయో
Tags:    

Similar News