వయసు పెరిగినా సొగసు తరగని అందగత్తెల పేర్లలో శ్రియ సరన్ పేరు ముందే ఉంటుంది. అప్పుడెప్పుడో వచ్చిన సంతోషం మొదలుకొని తాజాగా వచ్చిన పైసా వసూల్ వరకు తన అందం.. అభినయంతో ప్రేక్షకులను బాగా మెప్పించింది. నిన్న మొన్నటి వరకు పెళ్లిమాటెత్తితే ఇంకా టైం ఉందంటూ చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ తాజాగా ఓ రష్యన్ తో పెళ్లికి రెడీ అయిపోయిందనే టాక్ టాలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తోంది.
శ్రియ ఆ మధ్యన మాల్దీవులకు షికారుకెళ్లింది. అక్కడ సముద్రంలో ఈత అవీ కొట్టి తెగ ఎంజాయ్ చేసింది. అప్పుడే ఆమెకు రష్యన్ బోయ్ ఫ్రెండ్ పరిచయం అయ్యాడని తెలుస్తోంది. అంతవరకు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే శ్రియ అక్కడి నుంచి స్లో అయిపోయింది. డేటింగ్ చేస్తున్న విషయం గురించి శ్రియ ఎక్కడా అఫీషియల్ గా మాట్లాడలేదు. అలాగని ఇలాంటి కామెంట్లను తప్పుపట్టనూ లేదు. శ్రియ తల్లి మాత్రం ఈ రిలేషన్ షిప్ ను కొట్టిపారేసింది. వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారన్న మాటే అబద్ధమంటూ చెప్పింది.
శ్రియ డేటింగ్ న్యూస్ పబ్లిష్ చేసిన మీడియా హౌస్ ఆమె తల్లి చెప్పిన మాటలను అసలు పట్టించుకోనేలేదు. దానికి కారణం శ్రియనే అని తాజాగా తెలిసింది. తన తల్లి మాటను పబ్లిష్ చేయవద్దంటూ ఒక క్లోజ్ ప్రెండ్ డ్ తో ఆ మీడియాపై ఒత్తిడి తెచ్చిందిట. ప్రస్తుతం శ్రియ తనకున్న కమిట్ మెంట్స్ వల్ల ఈ వ్యవహారంపై ఏమీ మాట్లాడకుండా ఉండిపోతోందని ఆమె సన్నిహితులు అంటున్నారు. మార్చి లో ఈ వ్యవహారానికి శుభం కార్డ్ పడుతుందని చెబుతున్నారు. అంటే నిజంగానే రష్యన్ గయ్ ను పెళ్ళాడనుందా? ఏంటి శ్రియ మాకు షాకేనా??