23 ఏళ్ల కుర్రాడితో శ్రియ థ్రిల్లర్
30వ పడిలో పడితే హీరోయిన్ల కెరీర్ చరమాంకానికి వచ్చేసినట్లే. ఐతే ఈ ఆనవాయితీని బ్రేక్ చేసే హీరోయిన్లు కూడా కొందరుంటారు. అందులో శ్రియ ఒకరు. ఓ దశలో ఆమె కెరీర్ కూడా ముగింపు దశకు వచ్చినట్లే కనిపించింది. కానీ శ్రియ మళ్లీ మంచి మంచి అవకాశాలు అందుకుంటూ తన ఉనికిని చాటుకుంటోంది. ఈ ఏడాది ఆమె ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి మైల్ స్టోన్ మూవీలో నటించింది. ఇప్పుడు బాలయ్య సరసనే ‘పైసా వసూల్’లోనూ నటించింది. త్వరలోనే శ్రియ ఓ కొత్త దర్శకుడితో లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ చేయబోతోందట. ‘పైసా వసూల్’ ప్రమోషన్లలో భాగంగా ఆ సినిమా వివరాలు వెల్లడించింది శ్రియ.
తనతో సినిమా చేయబోయే యువ దర్శకుడి వయసు కేవలం 23 ఏళ్లేనని.. ఐతే అతను చెప్పిన సైకో థ్రిల్లర్ కథ తనను కట్టి పడేసిందని.. ఈ సినిమా తనకు ఒక మేకోవర్ అవుతుందని.. తనను కొత్తగా చూపిస్తుందని.. ఈ సినిమా చేయడానికి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని శ్రియ చెప్పింది. ఇక ‘పైసా వసూల్’లో తన పాత్ర గురించి.. బాలయ్యతో మరో సినిమా చేయడం గురించి శ్రియ మాట్లాడుతూ.. ‘‘ఇందులో నేను జర్నలిస్టు పాత్ర చేస్తున్నాను. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బాలయ్య గారితో మూడో సినిమా చేయడం చాలా హ్యాపీ. ఆయన ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది. ‘పైసా వసూల్’లో బాలయ్య పాత్ర స్టన్నింగ్ గా.. చాలా ఆసక్తికరంగా.. కొత్తగా ఉంటుంది’’ అని శ్రియ చెప్పింది. ఇటీవలి సినిమాల్లో తనకు ‘అర్జున్ రెడ్డి’ బాగా నచ్చిందని.. అలాంటి కొత్త సినిమాలు రావాల్సిన అవసరముందని శ్రియ అభిప్రాయపడింది.