స్టార్ హీరోయిన్.. కానీ ఆర్థిక సమస్యలు!

Update: 2020-05-18 11:50 GMT
సినిమా రంగంలో ఎవరికైనా ఆర్థిక సమస్యలు ఉంటాయేమో కానీ స్టార్లకు ఆర్థిక సమస్యలు ఉండవని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అదేమీ నిజం కాదు. కొందరు నిజంగానే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఎవరికి తగ్గ సమస్యలు వారికి ఉంటాయి. ఈమధ్య హీరోయిన్ శృతి హాసన్ తనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది.

శృతి ఈమధ్యే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని.. తీర్చాల్సిన లోన్స్ ఉన్నాయని చెప్పారు. నాన్నగారిని డబ్బు అడిగితే ఇస్తారు కానీ అడిగే అలవాటు లేదని చెప్పింది. ఆర్థికపరమైన విషయాలలో తనకు ఎవరి మీదైనా ఆధారపడడం ఇష్టం ఉండదని.. ఇండిపెండెంట్ గా ఉండాలని భావిస్తానని తెలిపింది. తన ప్రొఫెషన్ రిస్క్ తో కూడుకున్నదని కూడా చెప్పుకొచ్చింది.

శృతి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ- గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'క్రాక్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి సినిమా 'లాబం' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలు కనుక విజయం సాధిస్తే శృతికి కొత్త ఆఫర్లు వచ్చే అవకాశాలు లేకపోలేదు..ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ తీరే అవకాశం కూడా ఉంది.
Tags:    

Similar News