హీరోయిన్ల నైనా తీసుకోండి, ఇతర నటీనటులైనా కానివ్వండి. మహేష్ బాబు లాంటి అందగాడితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంకంటే ఎక్సైట్ మెంట్ ఏముంటుంది? మహేష్ మహేష్... అంటూ `అష్టాచమ్మా`లో స్వాతి కలవరించినట్టుగా ప్రిన్స్ పేరే కలవరిస్తారు. హీరోయిన్లైతే ఇంకో ఆకు ఎక్కువే అని చెప్పాలి. మహేష్ అలా, మహేష్ ఇలా.. సెట్లో మేమిద్దరం ఎలా ఉండేవాళ్లమో తెలుసా? అని మాట్లాడుతుంటారు. అయితే శ్రుతి హాసన్ లో మాత్రం ఆ రేంజ్ ఎక్సైట్ మెంట్ కనిపించడం లేదు. నిన్న జరిగిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... ``మహేష్‌తో సినిమా అంటే ఎక్సైటింగ్ గానే అనిపించింది. కథ, పాత్రలు విన్నాక ఓవర్ ఎక్సైట్ అయ్యాను`` అని చెప్పుకొచ్చింది. కథ పాత్రలకి ఎక్సైట్ అయినంతగా మహేష్ విషయంలో ఎక్సైట్ అవ్వలేదన్నమాట. అంతేలెండి... మరీ అంత ఇదిగా ఎక్సైట్ అవ్వడానికి శ్రుతి ఏమైనా కొత్త హీరోయిన్నా, తెలుగు హీరోయిన్నా? బాలీవుడ్ వరకు దున్నేసి వచ్చింది. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. దానికి తోడు ఆమె కమల్‌హాసన్ కూతురాయె.
శ్రుతి తన తండ్రి కమల్‌హాసన్ లాగే కథలనిబట్టే ప్రయాణం చేస్తోందని ఆమె మాటల్నిబట్టి చూస్తే అర్థమవుతోంది. దర్శకుడు, నిర్మాత, హీరో... ఇవేవీ శ్రుతి పట్టించుకోదట. కథ నచ్చితే వెంటనే ఓకే చెప్పేస్తుందట. శ్రుతి ఊరికే ఈ మాటలు చెప్పడం లేదు. నిజంగానే ఇటీవల ఆమెని ఓ కొత్త నిర్మాత సంప్రదించాడట. చిన్న సినిమాని తీస్తున్నాం, మీరు నటించాలని అడిగాడట. కథ విని వెంటనే ఓకే చేసిందట. కానీ రెమ్యునరేషన్ విషయంలో ఆ నిర్మాత వెనకడుగు వేయడంతో శ్రుతి ఆ సినిమా చేయలేకపోయిందట. శ్రుతి పక్కా ప్రొఫెషనల్ కథానాయికగా మారిపోయింది. సక్సెస్‌లు, ఫెయిల్యూర్లు, స్టార్ సినిమాలు, చిన్న సినిమాలు... ఇవేవీ ఆమె పట్టించుకోవడం లేదు. మంచి కథని ఎంపిక చేసుకోవడం, వాటిలో నటిస్తూ ప్రయాణం చేయడం అంతే. గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్గు, సిల్వర్ లెగ్గు... ఇలాంటి మాటల్ని అస్సలు పట్టించుకోనని చెప్పుకొచ్చింది శ్రుతి. శ్రీమంతుడు తర్వాత తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేయాలనుకొంటున్నట్టు స్పష్టం చేసింది శ్రుతి.