శ్రుతిహాసన్ ఐరెన్ లెగ్ టు గోల్డెన్ లెగ్ ఎదిగేసింది. ఇప్పుడు ఈ అమ్మడు టచ్ చేస్తే చాలు మిడాస్ టచ్ లా అంతా గోల్డ్ అయిపోతోంది. అందుకే మూడు పరిశ్రమల్లో బిజీ నాయికగా వెలిగిపోతోంది. అయితే ఈ స్థాయికి రాకముందు తనని బైటి ప్రపంచం గుర్తించడానికి చాలానే చేసింది.
సంగీతం - సాహిత్యం - చిత్రలేఖనం, గానం ఇలా అన్ని విభాగాల్లోనూ తనని తాను ప్రపంచానికి చాటుకోవాలని ఉవ్విళ్లూరిపోయింది. ఇప్పుడు నటి అయ్యింది. స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకోవడానికి అంతే శ్రమించింది. అయితే ఇంతగా శ్రమించడానికి తనకి ఇన్ స్పిరేషన్ ఎవరు అంటే తండ్రి కమల్ హాసన్ పేరు చెబుతోంది. అంతేకాదు అతడు తనతో అన్న ఓ మాట గురించి చెప్పుకొచ్చింది.
నువ్వు ఏ పనిచేసినా అందులో నెం.1 కావాల్సిందే. చివరికి వీధులూడ్చే పని అయినా నువ్వే నెం.1 కావాలి.. అనేవారాయన. ఆ మాట నా మనసులో బలంగా నాటుకుపోయింది. అప్పట్నుంచే నా ఆలోచనల్లో మార్పొచ్చింది అని చెప్పింది. ఇప్పుడర్థమైందా? శ్రుతిహాసన్ పనిని ఎంతగా ప్రేమిస్తుందో? లక్ష్యాన్ని ఢీకొట్టడానికి అహర్నిశలు ఎందుకు శ్రమిస్తుందో?