శృతి హాసన్‌ బాగా ముదిరి పోయింది

Update: 2019-04-03 10:38 GMT
కమల్‌ హాసన్‌ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ శృతిహాసన్‌ కొద్ది కాలంకే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. మల్టీ టాలెంట్‌ అమ్మాయిగా అందరి ప్రశంసలు అందుకున్న శృతిహాసన్‌ తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో స్టార్‌ హీరోలకు జోడీగా నటించింది. ఒక వైపు హీరోయిన్‌ గా నటిస్తూనే మరో వైపు విదేశాల్లో మ్యూజికల్‌ లైవ్‌ షోలు ఇచ్చింది. ఇదే సమయంలో ఈమె లండన్‌ కు చెందిన మైఖేల్‌ కోర్సలేతో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.

ఇద్దరు కలిసి తిరగడం, తన కుటుంబంలో వ్యక్తి మాదిరిగా మైఖేల్‌ కు గుర్తింపు ఇవ్వడం చేసిన శృతి హాసన్‌ ఇప్పుడు పెళ్లి విషయం ఎత్తితే మాత్రం వింత వ్యాఖ్యలు చేస్తోంది. డేటింగ్‌ చేస్తే, రిలేషన్‌ షిప్‌లో కొనసాగితే పెళ్లి చేసుకోవాలా? ఒక వ్యక్తితో పరిచయం పెళ్లికి దారి తీయడం జరుగుతుందా, మా రిలేషన్‌ షిప్‌ ఒక స్వచ్చమైన స్నేహం, దాన్ని అపార్ధం చేసుకుని పెళ్లి వార్తలు పుట్టిస్తున్నారు. చాలా మంది తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ కథనాలు అల్లుతున్నారు.

ఆ విషయం గురించి తానెప్పుడు మాట్లాడలేదు. మా ఇద్దరి పెళ్లిని మీడియా వారే చేస్తున్నారు అంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తి అయిన సందర్బంగా మీడియాతో చిట్‌ చాట్‌ చేసిన శృతి హాసన్‌ తన ప్రేమ, పెళ్లి విషయమై క్లీయర్‌ గా స్పందించింది. ఆమె మాటలను బట్టి చూస్తుంటే ఆమెకు పెళ్లిపై సరైన అభిప్రాయం లేదని, అసలు ఆమె పెళ్లి చేసుకుంటుందో లేదో అనే విషయం కూడా తెలియడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News