యూనివర్శిల్ స్టాన్ కమల్ కూతురు శృతి హాసన్ చాలా బోల్డ్ గా ఉంటారు. ఆమె మాటలు కూడా చాలా బోల్డ్ గా ఉంటాయి. తాను ఓ స్టార్ కూతురుని.. తాను ఓ సెలబ్రెటీని అనే విషయాన్ని ఆమె ఎక్కువగా పట్టించుకోకుండా తన మనసులో ఉన్న మాటలను చెప్పేస్తుంది. సహజంగా అయితే సెలబ్రెటీలు వారి వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పేందుకు ఇబ్బంది పడతారు. కాని శృతి హాసన్ తన లవ్.. బ్రేకప్.. ఇతర విషయాలు అన్ని కూడా బయటకు చెప్పేస్తుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉండే ఈమె మరోసారి తన మనసులో మాట చెప్పేసింది.
శృతి హాసన్ ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ మరోసారి అభిమానుల ముందుకు వచ్చింది. ఆ సమయంలో ఆమె చాలా చాలా విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఎప్పుడు లైవ్ కు వచ్చినా కూడా ఆమెను అభిమానులు ప్రేమ పెళ్లి విషయమై ప్రశ్నిస్తూ ఉంటారు. తాజాగా కూడా ఒక అభిమాని శృతి హాసన్ పెళ్లి గురించి ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నకు శృతి హాసన్ ఎప్పటిలాగే చాలా బోల్డ్ గా సమాధానం చెప్పింది. నేను పెళ్లి చేసుకునేందుకు ఆసక్తిగా లేను. నేను పెళ్లి చేసుకుంటాను అనుకోవడం లేదు అంటూ చెప్పేసింది. అయితే ప్రస్తుతం మనం ఈ సమయంలో ఈ పరిస్థితుల నుండి ఎలా బయట పడాలి.. 2021 నుండి ఎలా బయట పడాలి అనే విషయాలను ఆలోచించాలంటూ చెప్పుకొచ్చింది.
హీరోయిన్ గా ప్రస్తుతం హిందీలో పలు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తెలుగు లో ప్రభాస్ కు జోడీగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందుతున్న సలార్ సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు మరియు తమిళం నుండి ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. కాని వాటిల్లో కొన్నింటిని మాత్రమే ఈమె ఎంపిక చేసుకుంటూ ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా చేయబోతున్న సినిమా లో ఈమెకు వచ్చిన ఆఫర్ ను తిరష్కరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా తమిళంలో కూడా ఈమె ఒక సినిమాను తిరష్కరించిందట. సలార్ సినిమా తో ఈమె మరోసారి తన పాన్ ఇండియా స్టార్ డమ్ ను చాటుకుంటుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.