బాయ్‌ ఫ్రెండ్ లోకమే తన లోకంగా..

Update: 2018-01-30 02:30 GMT

సౌత్ ఇండియన్ బ్యూటీ శృతి హాసన్ గత కొంత కాలంగా వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. సినిమాపరంగా కాకుండా తన వ్యక్తిగత జీవితంలో షాకింగ్ డిసిషన్స్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. దీంతో అటు బాలీవుడ్ మీడియా సౌత్ మీడియా అమ్మడికి వ్యవహారాలపై ఓ పెద్ద కథనాలనే ప్రచారం చేస్తూ శృతి ఇమేజ్ ని ఇంకా కాంట్రవర్సి అయ్యేలా చేస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే శృతి గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతోన్న సంగతి తెలిసిందే.

మైకేల్ కొర్సలే అనే యువకుడితో ప్రపంచ దేశాలను చుట్టేస్తూ ఎక్కడ పార్టీలు జరిగినా స్పెషల్ దర్శనాలను ఇస్తోంది. తన తండ్రికి తల్లికి కూడా కాబోయే హస్బెండ్ ని పరిచయం చేసింది. ఇకపోతే బాయ్ ఫ్రెండ్ తో అమ్మడు రీసెంట్ గా అదిరిపోయే పార్టీని చేసుకుంది. ఆదివారం శృతి 32వ బర్త్ డే కావడంతో అతని ఫ్రెండ్స్ ని పిలిచింది. పార్టీలో అందరు బాయ్స్ ఉన్నారు. ఇక వాళ్లతో కలిసి శృతి కేక్ కట్ చేసింది. కాకపోతే తన స్నేహితురాళ్ళను వదిలేసి.. మైఖేల్ లోకమే తన లోకంగా మార్చుకుంటోందని ఈ ఫోటోలను చూస్తే అనిపించకమానదు.

అందుకు సంబందించిన ఫోటోలని తన సోషల్ మీడియాలో ఎకౌంట్ లో కూడా అమ్మడు షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలపై నెటిజన్స్ కూడా చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. హ్యాపీగా ఎంజాయ్ చేయడంలో ఎవరైనా శృతి తరువాతే అని కొందరు ఆమెకు బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే శృతి ప్రస్తుతం తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న శబాష్ నాయుడు అనే సినిమాలో నటిస్తోంది. 
Tags:    

Similar News