మన భాగ్యలక్ష్మి వయసు ఎంత? అంటే.. ఇప్పటికింకా పదమూడే. దీనర్థం 36 ఏళ్ల శ్రుతిహాసన్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు పూర్తి చేసుకుంది అని. పదమూడు సంవత్సరాల క్రితం 2009 యాక్షన్ థ్రిల్లర్ `లక్` తో శృతి హాసన్ నటిగా బాలీవుడ్ కి పరిచయమైంది. గబ్బర్ సింగ్ లో భాగ్యలక్ష్మిగా ఆకట్టుకోవడానికి ఎక్కువ సమయం పట్టనే లేదు. కేవలం మూడేళ్లలోనే పవన్ కల్యాణ్ సరసన అవకాశం దక్కించుకుని విజేతగా నిలిచింది. వినోద పరిశ్రమలో ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం పాటు కొనసాగిన ఈ బ్యూటీ పలు బ్లాక్ బస్టర్లలో నటించింది. నటిగా పూర్తి పరిణతితో మెప్పించింది. ఈ ప్రయాణం ఉద్వేగంతో కూడుకున్నది.
ఈ విషయం శ్రుతి ఇన్ స్టాలో రాసుకున్న నోట్ తో బయటపడింది. శ్రుతి తాజాగా ఆకట్టుకునే నోట్ ఒకటి రాసింది. ఆమె సినీ రంగంలో తన ప్రయాణం గురించి ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ``మ్యాజికల్ 13 సంవత్సరాలు - నేను సినిమా రంగంలో ఇంతకంటే ఎక్కువ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఇది చేయడానికి పుట్టలేదు.. నేను దీన్ని ప్రేమించడం నేర్చుకున్నాను.. సినిమా నా ఆనందానికి గొప్ప మూలంగా మారింది.
ఈ రంగం నాకు చాలా కృతజ్ఞతతో కూడిన జీవితాన్ని ఇచ్చింది. సంవత్సరాలుగా నేను జయాపజయాలను ఎలా ఎదుర్కోవాలో.. ఆత్మవిశ్వాసంతో ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్చుకున్నాను. అన్నింటికంటే ఎక్కువగా అభినందించడం గురించి చాలా నేర్చుకున్నాను. నేను ఇంతకు ముందెన్నడూ తెలియని స్త్రీలకు కథలు చెప్పడం వాటికి ఆత్మలను ఇవ్వడం గౌరవం. నాకు లభించిన ఇంతటి ప్రేమ - ప్రశంసలకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని`` అంటూ ఎమోషనల్ నోట్ ని రాసింది. ``ఇకపైనా కళ అనే బహుమతితో మీకు మరింత ఎక్కువ ఇవ్వాలని.. మరింతగా ప్రేమలో పడాలని నేను ఆశిస్తున్నాను. ఊప్స్ - విచిత్రాలు కేవలం విచిత్రంగా ఉండటమే కాకుండా ఈ 13 సంవత్సరాల పయనానికి థ్యాంక్యూ థ్యాంక్యూ..! అంటూ కవితాత్మకంగా తన ఆనందం వ్యక్తం చేసింది.
ఇక వ్యక్తిగత వ్యవహారంపై శ్రుతి ఎలాంటి క్లూ ఇవ్వలేదు. దానికి కారణం కూడా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. నిజానికి నా వ్యక్తిగత జీవితంపై ప్రశ్నిస్తే.. తొలి ప్రశ్న `షాదీ కబ్ హై? పెళ్లి ఎప్పుడు?.. ప్రశ్న సంఖ్య 2 - మీ నాన్న ఏమనుకుంటున్నారు? లేదా మీతో ఉన్న ఆ వ్యక్తి (ప్రియుడు డూడుల్ శంతను) ఎలా ఉన్నారు? అని అడుగుతారు. మీరు వావ్ అనేంత వరకు సరదాగానే ఉంటుంది.. అందుకే నేను దాని గురించి మాట్లాడను అంటూ పంచీగా మాట్లాడింది శ్రుతి.
అన్నట్టు శ్రుతిహాసన్ కెరీర్ 13 ఏళ్లు పూర్తయినా అందులోంచి ఓ నాలుగేళ్లు తీసేయాలి. ఎందుకంటే అప్పట్లో విదేశీ మైఖేల్ కోర్సలేతో ప్రేమాయణంలో ఉన్నప్పుడు కెరీర్ కంటే తనకు వ్యక్తిగత జీవితం చాలా ఇంపార్టెంట్ అంటూ సినిమాలకు టాటా చెప్పేసింది. అగ్రనాయిక హోదాను కూడా లైట్ తీస్కుంది. అలా నాలుగేళ్లు సినిమాల్లో నటించనేలేదు. అందుకే తన కెరీర్ ఇప్పటికి నాలుగేళ్లు లెస్ చేస్తే తొమ్మిదేళ్లే!! ప్స్!!