మజ్నూ కోసం మేకప్ తగ్గిస్తున్న శృతి.. సాహసం స్వాసగా సాగిపో మూవీని రిలీజ్ కి రెడీ చేసిన నాగ చైతన్య.. మరో మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశాడు. మళయాళ మూవీ ప్రేమమ్ కి తెలుగు రీమేక్ గా రూపొందనున్న ఈ మూవీలో.. చైతన్య ముగ్గురు భామలతో ఆడిపాడనున్నాడు. ఇందులో శృతి హాసన్ కూడా ఉంది.
ఒకసారి ప్రేమలో విఫలమైన తర్వాత.. కాలేజ్ ప్రొఫెసర్ తో ప్రేమలో పడతాడు చైతూ. ఆ రోల్ నే శృతిహాసన్ పోషించనుంది. అయితే.. చైతు కంటే శృతి హాసన్ వయసు కేవలం పది నెలలే ఎక్కువ. వాళ్ల పబ్లిక్ ప్రొఫైల్స్ ఈ విషయాన్ని చెబుతున్నాయి. మరి కేరక్టర్ ప్రకారం అయితే. స్టూడెంట్ కంటే లెక్చరర్ వయసు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మరి చైతూకు జంటగా సరిపోవాలి, అదే సమయంలో కేరక్టర్ ప్రకారం కొంచెం ఏజ్డ్ గా కనిపించాలి. ఈ కేరక్టర్ కోసం డైరెక్టర్ చందూ మొండేటి శృతిని కలిసినప్పుడు.. ఒరిజినల్ ని చూసిన ఈ భామ.. బాగా థ్రిల్ ఫీలయ్యిందిట. అందుకే ఆ పాత్ర కోసం తన లుక్ లో వేరియేషన్ చూపించేందుకు సిద్ధమైంది. సహజంగా తను వేసుకునే మేకప్ ని, కాస్ట్యూమ్స్ ని పక్కన పెట్టేసి.. కాస్త వయసు ఎక్కువ కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది శృతి. ఇంకా చెప్పాలంటే అసలు మేకప్ లేకుండా నటిస్తోంది అని చెప్పాలంటున్నాడు దర్శకుడు. అంతే కాదు డ్రెసింగ్ విషయంలోనూ.. మంగళగిరి కాటన్ చీరలు ధరించబోతోందిట ఈ భామ. అప్పుడప్పుడు కుర్తీస్ కూడా వేసుకుంటుందట ఈ సినిమాలో.
మొత్తానికి మజ్నూ కోసం మేకప్ తీసేస్తోంద శృతి హాసన్. ఈ కుర్రదాని స్కిన్ టోన్ కూడా బాగా ఫెయిర్. ఇప్పుడు మూవీ కోసం దాన్ని కూడా తగ్గించుకుని.. డీ గ్లామర్ గా కనిపించేందుకు రెడీ అయిపోయిందీ భామ. ఏమైనా కేరక్టర్ కోసం కమిట్మెంట్ లో కమల్ కూతురు అనిపించుకుంటోంది కదూ.