ఫోటో స్టొరీ: పాప లండన్ స్టైలింగ్ ఇలా ఉంది!

Update: 2019-09-10 01:30 GMT
గబ్బర్ సింగ్' సినిమాలో పవన్ క్యారెక్టర్ కు తిక్క ఉంటుంది.  అయితే ఆ సినిమాలో నటించిన హీరోయిన్ శృతి హాసన్ రియల్ లైఫ్ లో దాదాపు తిక్క టైపు.  మనసుకు తోచినట్టు చేస్తూ ఉంటుంది.  హీరోయిన్ గా పీక్స్ లో ఉండే సమయంలో సినిమాలకు గ్యాప్ ఇవ్వడం..  ఇంటర్నేషనల్ సింగర్ అవుతానంటూ లండన్ లో ఉండడం ఒక ఎత్తైతే.. మైఖేల్ కోర్సలే తో ప్రేమాయణం.. బ్రేకప్పాయాణం మరో ఎత్తు.  ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.  త్వరలోనే శృతి నటించిన కొత్త తమిళ సినిమా 'లాబం' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక అంతటితో ఆగితే ఆమె ను గబ్బర్ సింగ్ పోల్చే అవసరం ఎందుకు వస్తుంది?  సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందంటే.. ఆ లండన్ సింగింగ్ కెరీర్ ను పక్కన పెట్టేసిందేమోనని చాలామంది అనుకున్నారు. కానీ అదేమీ లేదు.  సినిమా కెరీర్ తో పాటుగా సింగింగ్ కెరీర్ ను కూడా సమాంతరంగా కొనసాగిస్తోంది.  ప్రస్తుతం శృతి లండన్ లోని ఈజ్లింగ్ టన్ లో సింగింగ్ షో చేస్తోందట.  అక్కడ షో కోసం రెడీ అయిన శృతి తన ఇన్స్టా  ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఆ ఫోటోకు "షో టైమ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  పాప్ గాయని తరహాలోనే బ్లాక్ డ్రెస్ ధరించి పొడవాటి బూట్లు వేసుకొని ఒక పోజిచ్చింది. ఈ ఫోటో.. రొటీన్ హీరోయిన్ల పరమ రొటీన్ హాటు ఫోటోలలో ఒకటి కాదు.  పూర్తిగా డిఫరెంటు.  సీరియస్ ఎక్స్ ప్రెషన్.. లుక్ అంతా అంతర్జాతీయం!

అమ్మడి వాలకం చూస్తుంటే బ్రిట్నీ స్పియర్స్.. షకీరా రేంజ్ లో పేరు తెచ్చుకునేవరకూ ఊరుకునేలా లేదు.  లండన్ ను వదిలేలా లేదు.  ఆ సంగతి పక్కన పెడితే ఈ ఫోటోకు కామెంట్లు అదిరిపోయాయి. "కిల్లింగ్ ఇన్ బ్లాక్".. "సింగర్ శృతి ఈజ్ బ్యాక్".. "సూపర్ స్టైలింగ్".. "వెస్ట్రన్ లుక్ సూట్ అయింది" అంటూ కామెంట్లు పెట్టారు.
Tags:    

Similar News