సంఘమిత్ర అనే తమిళ్ సినిమా గురించి ఇప్పుడు అందరు ఆశక్తిగా మాటలాడుకొంటున్నారు. బాహుబలి తరవాత ఇంత భారీ బడ్జెట్ సినిమాను సౌత్ లో తీస్తుంది ఇదే. రమరామిగా 250 కోట్ల బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను కేన్స్ ఫిలింఫెస్టివల్లో లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్ లో యుద్దానికి సిద్దమైన యోధురాలుగా గుర్రంపై శృతిహాసన్ లుక్ సినిమా పై అంచనాలను పెంచే విధంగా ఉంది. కాని ఇది కేవలం ఆర్ట్ వర్క అంతే. కాకపోతే ఇప్పుడు టాపిక్ సినిమా మేకింగ్ కాదు శృతిహాసన్ మార్కెట్ విలువ ఆమే నటనా ప్రతిభ గురించి.
ఇప్పటివరకు కెరీర్లో శృతిహాసన్ చేసిన గొప్ప పాత్రలు అయితే ఏమి లేవు. బాగా ఎమోషన్ ఉన్న సినిమా అంటే అది ధనుష్ తో చేసిన ‘3’. ఇంకా బాలీవుడ్లో కూడా డి-డే అనే సినిమాతో కాస్త తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే సినిమా మొత్తాన్ని తన నటనాకౌశల్యం తో మెప్పించింది ఇంతవరుకు లేదు. ఇప్పుడు శృతిహాసన్ ఎదుర్కుంటున్న పెద్ద విమర్శ ఇదే. ఒక సాధారణ కమర్షియల్ హీరోయిన్ పై ఇంత నమ్మకంగా భారీ బడ్జెట్ ప్రాజెక్టును చేయడానికి సిద్ధపడ్డ మేకర్స్ ధైర్యాన్ని గ్రేటే అనాలి.
ఈ ప్రాజెక్టులోకి శృతిహాసన్ ను తీసుకోవడానికి ప్రధాన కారణం ఆమెకు తెలుగు - తమిళ్ - హిందీ లో మార్కెట్ ఉండటమే అన్ని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.శృతిహాసన్ కూడా సంఘమిత్ర పాత్ర కోసం లండన్ వెళ్లి కత్తియుద్ధం, గుర్రపుస్వారి లాంటివి నేర్చుకుంది.ఈ సినిమా ఆమె సినీ ప్రయాణం లో గొప్ప స్టేజి అనే చెప్పాలి. సంగీతం డాన్స్ నటన ఇలా మల్టీ టాలెంటెడ్ అయన శృతి ఇప్పుడు ఈ వీరోచిత సినిమాతో మరో అడుగు ముందుకి వేసింది అని చెప్పవచ్చు. శృతి హాసన్ వచ్చిన ప్రతీ అవకాశాన్ని బాగానే వాడుకుంది. ఇప్పుడు ఇటువంటి విమర్శలకు తన నటనతో ఎలా సమాధానం చెబుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/