యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్బంగా దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో ఉన్న ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోట్లాది మంది అభిమానుల అభిమానం దక్కించుకున్న లోక నాయకుడు నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్బంగా ఆయన కూతురు మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ శృతి హాసన్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటుంది. ఒక కూతురు మాదిరిగా కాకుండా ఒక స్నేహితురాలిగా ఒక అభిమానిగా ఎప్పుడు కూడా కమల్ తో ఈమె ఉంటుంది అనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.
ఈ పుట్టిన రోజున ఆమె తన తండ్రికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. నీ ఈ జీవితంలో ఈ ఏడాది కూడా మరో అద్బుతమైన సంవత్సరంగా గడిచి పోవాలంటూ కోరుకుంటున్నాను అంటూ పేర్కొంది. ఈ ప్రపంచం కోసం నువ్వు చేయబోతున్న మరిన్ని అద్బుతాలు విజయవంతం అవ్వాలి. ఆ అద్బుతాల కోసం నేను వేచి చూస్తున్నాను అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఇక కమల్ సినిమాల విషయానికి వస్తే ఇండియన్ 2 సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అది ఎప్పుడు పునః ప్రారంభం అయ్యే విషయంపై క్లారిటీ లేదు. మరో వైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తమిళనాడు ఎన్నికల ముందు వస్తుందా తర్వాత వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.