తన తండ్రిలా ఇప్పటికే ఆల్ రౌండర్ అనిపించుకొంది శ్రుతిహాసన్. పాటలు పాడుతూ, మ్యూజిక్ చేస్తూ, నటిస్తూ.. ఇలా బోలెడన్ని కళల్ని ప్రదర్శిస్తోంది. పైగా రెండు మూడు భాషల్లో. అది చూసి శ్రుతిహాసన్ నిజంగా తండ్రికి తగ్గ కూతురే అంటున్నారంతా. ఆమె లోని టాలెంట్ ని గమనిస్తున్న తోటి కథానాయికలంతా కుళ్లుకొనే పరిస్థితి. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొన్న శ్రుతి ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. తండ్రిలాగే సినిమా నిర్మాణంతో పాటు దర్శకత్వం కూడా చేసేలా కనిపిస్తోంది. తన తండ్రి స్థాపించిన రాజ్ కమల్ బ్యానర్ లో తానూ ఓ పార్టనర్ గా చేరి సినిమా నిర్మాణం చేపట్టాలని తాజాగా డిసైడ్ అయ్యింది శ్రుతి. తొలుత ఆ బ్యానర్ లో షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోలు చేస్తుందట. ఆ తర్వాత సినిమా నిర్మాణం కూడా చేపడుతుందట. ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది శ్రుతి.
శ్రుతిహాసన్ స్టార్ హీరోయిన్ గా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకొంటోంది. యేడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తోంది. ఆ లెక్కన పెద్దయెత్తునే డబ్బు సంపాదిస్తున్నట్టు లెక్క. ఆ మొత్తాన్ని మళ్లీ సినిమా ఇండస్ట్రీలోనే ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. అందుకే తన తండ్రితో కలిసి సినిమా నిర్మాణంలోకి అడుగుపెడుతోంది. శ్రుతికి మ్యూజిక్ పరంగా మంచి టేస్ట్ ఉంది. అందుకే మ్యూజిక్ వీడియోలు చేసి మార్కెట్ చేయాలనుకుంటోంది. అలాగే ఇటీవల షార్ట్ ఫిల్మ్స్ కల్చర్ కూడా బాగా పెరిగిపోతోంది. స్టార్ హీరోయిన్లు సైతం షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. ట్రెండ్ కి తగ్గట్టుగా ఆలోచిస్తూ నిర్మాతగా దూసుకెళ్లాలని శ్రుతి డిసైడ్ అయ్యింది. తాను తీసుకొన్న నిర్ణయం పట్ల తండ్రి కమల్ హాసన్ గర్వంగా ఫీలయ్యాడని శ్రుతి చెప్పుకొచ్చింది.