నీ బాడీలో ఏ పార్ట్‌ కు సర్జరీ చేయించావు?

Update: 2022-04-22 17:30 GMT
శృతి హాసన్‌ యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ కూతురు అయినా కూడా తనదైన సొంత ట్యాలెంట్‌ తో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆమె హీరోయిన్ గా చేసిన ఎన్నో సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అందుకే ఆమె హీరోయిన్ గా చేస్తున్న సినిమాలకు ఎంత క్రేజ్‌ ఉంటుందో.. సోషల్‌ మీడియాలో ఆమె పోస్ట్‌ లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది అనడంలో సందేహం లేదు.

ప్రేమ వ్యవహారాలు.. ఇతర విషయాల వల్ల ఎప్పటికప్పుడు మీడియాలో ఉండే శృతి హాసన్ ఇన్ స్టా గ్రామ్‌ లో అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది. తాజాగా ఏదైనా సరదాగా అడగండి సమాధానం ఇస్తాను అంటూ అభిమానులతో చిట్‌ చాట్‌ చేసింది. ఆసమయంలో శృతి హాసన్ ను ఫాలోవర్స్ ఇష్టానుసారంగా ఏది పడితే అది అడిగేశారు. ఆమె చాలా ప్రశ్నలను ఫన్నీగా తీసుకుని సమాధానం చెప్పింది.

ఒక వ్యక్తి మాత్రం మీరు మీ బాడీలో ఏ పార్ట్స్ కు ఆపరేషన్‌ చేయించుకున్నారు.. సర్జరీ చేయించుకుని ఏ పార్ట్‌ ను మార్చుకున్నారు అన్నట్లుగా ప్రశ్న అడిగాడు. అతడు అడిగిన ప్రశ్నను శృతి హాసన్‌ లైట్‌ తీసుకోవచ్చు. కాని ఆమె అలా చేయలేదు. తాను ముక్కు కు ఆపరేషన్ చేయించుకున్నట్లుగా చెప్పింది. అంతుకు ముందు నీ పని నీవు చూసుకుంటే మంచిది అన్నట్లుగా కామెంట్‌ చేయడంతో పాటు అడిగావు కనుక చెప్తున్నాను అంటూ ఫోటో ను షేర్‌ చేసింది.

శృతి హాసన్ ముక్కుకు సర్జరీ చేయించుకున్న విషయం చాలా మందికి తెల్సిందే. మీడియాలో చాలా కాలంగా ఆ విషయం గురించి చర్చ జరుగుతుంది. ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన సమయంలో ఆమె పోటోలో ముక్కు మరియు ఇప్పటి ముక్కు చాలా తేడా ఉంటుంది. ఆ విషయం ను ఆమెతో చెప్పించానే ఉద్దేశ్యంతో సదరు నెటిజన్‌ మీరు ఏ పార్ట్‌ కు ఆపరేషన్ చేయించుకున్నారు అన్నాడు. అన్నట్లుగానే ఆమె సమాధానం చెప్పింది.

ఇక శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ తో కలిసి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్‌ సినిమాను చేస్తోంది. బాలకృష్ణ తో కలిసి గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తుంది. ఇటీవలే చిరంజీవి హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో కూడా శృతి హాసన్‌ నటిస్తుంది. ప్రస్తుతం చిరంజీవితో షూటింగ్‌ లో ఈమె పాల్గొంటుంది.
Tags:    

Similar News