పెళ్లికి టైముంది.. బ‌ర్త్ డే చేసుకుందాం!

Update: 2019-07-03 04:53 GMT
ప్రేమ‌లో ప‌డ్డాక సినిమాల‌కు దూరంగా ఉన్న న‌టి శృతిహాస‌న్ ఇప్పుడు మ‌ళ్లీ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపుగా ఏడాదిన్న‌ర పాటు బాయ్ ఫ్రెండ్ మైకేల్ కోర్సేల్ తో చెట్టప‌ట్టాలేసుకొని తిరిగిన ఆమె.. ఇప్పుడు అత‌డితో బ్రేక‌ప్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఏమైందో కానీ ప్రేమ‌కు గుడ్ బై చెప్పేసి కెరీర్ మీద ఫోక‌స్ చేసింది.

ఏడాదిన్న‌ర సినిమాల‌కు దూరంగా ఉన్నా.. కోరుకున్నంత‌నే మ‌ళ్లీ రెండు సినిమాల్లో వ‌చ్చిన ఆఫ‌ర్ తో మ‌ళ్లీ కెరీర్ మీద ఫోక‌స్ పెట్టారు. ప్రేమ‌.. పెళ్లి లాంటి వాటిని ప్ర‌స్తుతం ఆలోచించే స్థితిలో శృతి ఉన్నా.. ఆమె అభిమానులు మాత్రం పెళ్లి ఎప్పుడు?  పెళ్లికి మ‌మ్మ‌ల్ని త‌ప్ప‌క పిల‌వండి లాంటి మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా అభిమాని ఒక‌రు ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేస్తూ.. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?  ఆ విష‌యం చెబితే త‌మలాంటి అభిమానుల‌మంతా క‌చ్ఛితంగా పాల్గొంటామ‌న్నారు.

దీనికి శృతిహాస‌న్ రియాక్ట్ అయ్యారు. త‌న పెళ్లికి చాలా రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంద‌ని.. దాని కంటే ముందు త‌న బ‌ర్త్ డే ను అంద‌రం క‌లిసి ఒక‌టిగా జ‌రుపుకుందాం రండి అంటూ బ‌దులిచ్చారు. శ్రుతి అలా స్పందించిన త‌ర్వాత ఆమె అభిమానులు ఆమె బ‌ర్త్ డే వేడుక‌ల్ని ధూంధాంగా చేసేయ‌రు.
Tags:    

Similar News