కొందరు మాత్రమే ముక్కు సూటిగా మాట్లాడగలరు. అలాంటి జాబితాలో శ్రుతి హాసన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఏది ఉన్నా మనసులో దాచుకోకుండా బహిరంగంగా మాట్లాడేయడం ఈ భామకే చెల్లింది. తండ్రి కమల్ హాసన్ తరహాలోనే ప్రేమాయణాలు వగైరా దాచేందుకు శ్రుతి అస్సలు ఇష్టపడదు. అంతేకాదు .. తన అందం పెంచుకునేందుకు ముక్కును సవరించుకునే శస్త్ర చికిత్స చేయించుకున్నానని శ్రుతిహాసన్ స్వయంగా అంగీకరించింది. ఇలా ఒప్పుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోను పలు ఇంటర్వ్యూల్లో నోస్ జాబ్ గురించి శ్రుతి ఓపెన్ గానే మాట్లాడింది. దానిని రహస్యంగా ఏనాడూ దాచింది లేదు.
ఇప్పుడు మరోసారి దానిని కన్ఫామ్ చేసింది. అంతేకాదు... తనను పదే పదే అదే విషయంపై ప్రశ్నించే వారికి ఘాటైన రిప్లై ఇచ్చింది. ఒక రకంగా శృతి హాసన్ `ముక్కు`న వేలేసుకునే సమాధానం ఇచ్చిందని చెప్పాలి. అందాల శృతి హాసన్ మాట్లాడుతూ... తాను ఎందుకు అందంగా కనిపించాలనుకుంటున్నానో తనకు తానుగా చెప్పుకుంటూ ఎవరినీ సమర్థించాల్సిన అవసరం లేదని చెప్పింది.
తాజా ఇంటర్వ్యూలో శ్రుతి తన ముక్కును సరి చేసే శస్త్ర చికిత్స చేయించుకున్నానని తెలిపింది. `అందంగా` కనిపించడానికి అలా చేసానని అంగీకరించింది. దీనికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని కూడా విసుర్లు విసిరింది. శృతి హాసన్ `డీవియేటెడ్ సెప్టం`(వంగి ఉబ్బి ఉన్న ముక్కు) గురించి మాట్లాడింది. ముక్కులో ఒకవైపు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడే పరిస్థితి తనకు ఉండేదని తెలిపింది.
శృతి హాసన్ తనకు `ముక్కుపుడక` (ఉబ్బినట్టుగా) ఉందని ఒప్పుకుంది. అది చాలా స్పష్టంగా కనిపించేదని చెప్పింది. మొదటి సినిమాని తన పాత ముక్కుతోనే చేశానని అయితే ఇటీవలి సినిమాల్లో చాలా భిన్నంగా కనిపించానని కూడా శ్రుతి చెప్పింది. తనకు నిజంగానే `డీవియేటెడ్ సెప్టం` సమస్య ఉందని తెలిపింది. తన ముక్కు నొప్పి పెట్టేదని కూడా చెప్పింది. తన డివియేటెడ్ సెప్టంను ఫిక్స్ చేయడంతో పాటు తన ముక్కును అందంగా మార్చగలిగితే తాను ఎందుకు అలా చేయకూడదు? అని కూడా శృతి హాసన్ ఎదురు ప్రశ్నించింది. శ్రుతి హాసన్ లాజిక్ ని తెరపైకి తెచ్చింది. సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలా ప్రతిదీ వివరించింది.
తాను అందంగా ఒక నిర్దిష్ట మార్గంలో ఎందుకు కనిపించాలనుకుంటున్నానో సమర్థించుకోవాల్సిన అవసరం తనకు లేదని శ్రుతి ఖరాకండిగా చెప్పింది. ఇటీవల ఫిల్లర్లు కూడా వచ్చాయని శృతి హాసన్ తెలిపింది. నటి కావాలనుకుంటే మునుముందు ఫేస్ లిఫ్ట్ తో ముందుకు సాగవచ్చని అన్నారు. ఇది నా శరీరం.. నిర్ణయం తీసుకునే పూర్తి హక్కు నాకు ఉందని శృతి హాసన్ తన వాదన వినిపించింది. తాను ఇలాంటి సౌందర్య ప్రక్రియలను ప్రోత్సహించడం లేదని.. అయితే తనకు ఎంపిక చేసుకునే వ్యక్తిగత హక్కు ఉందని.. ప్రతి ఒక్కరూ హక్కులు కలిగి ఉండాలని విశ్వసిస్తున్నారని అన్నారు. నేనేం చేస్తున్నానో నన్ను చేయనివ్వండి`` అని ఆమె అన్నారు.
శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. తాను పని చేయడం ప్రారంభించినప్పుడు హీరోయిన్ లాగా కనిపించడం లేదని తనతో చెప్పేవారట. చూడటానికి ఒక పాశ్చాత్య యువతిలా విదేశీ ముఖంలా కనిపించేదని కూడా సహచరులు తనతో అనేవారట. కానీ కెరీర్ లో మెజారిటీ సినిమాల్లో పల్లెటూరి అమ్మాయిగా నటించడం తనకు ఇప్పటికీ ఇంకా గందరగోళంగా ఉందని చెప్పింది. అందాల శ్రుతిహాసన్ ప్రస్తుతం సలార్ లాంటి భారీ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. పలు తెలుగు తమిళ చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. వాటికి సంబంధించిన వివరాల్ని వెల్లడించాల్సి ఉంది.