బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన శృతిహాసన్ తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న విషమం తెలిసిందే. మధ్యలో సినిమాలకు కొంత విరామం ఇచ్చిన శృతిహాసన్ `క్రాక్` మూవీతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసింది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా వరుస విజయాల్ని సొంతం చేసుకుంటోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న శృతిహాసన్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్స్ తో సినిమాలు చేస్తోంది.
తను తొలి సారి బాలయ్యతో కలిసి నటించిన `వీరి సింహారెడ్డి` జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ తో నటించిన `వాల్తేరు వీరయ్య` కూడా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చేసి హంగామా చేస్తోంది. ఈ నేపథ్యంలో శృతిహాసన్ ఆరోగ్యంపై పలు రకాల వార్తలు నెట్టింట హల్ చల్ చేయడం మొదలైంది. తను గత కొన్ని రోజులుగా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతోందని వార్తలు షికారు చేస్తున్నాయి.
మానసిక రుగ్మతతో బాధపడుతోందని పలు రకాల వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా శృతిహాసన్ స్పందించింది. తాను మానసిక సమస్యలతో ఇబ్బంది పడటం లేదని, కేవలం తాను వైరల్ ఫీవర్ తో మాత్రమే బాధపడుతున్నానని స్పష్టం చేసింది. అంతే కాకుండా తన ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా పలు వెబ్ సైట్ లలో వస్తున్న తప్పుడు వార్తలని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనదైన స్టైల్ లో పంచ్ వేసింది.
ఇలాంటి తప్పుడు సమాచారం, నాటకీయత కారణంగా చాలా మంది తమ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలని బయట పెట్టడానికి భయపడుతుంటారు. అయితే అది నా విషయంలో మాత్రం పని చేయలేదు. నేను ఎప్పుడూ ఒక మానసిక నిపుణురాలిగా వ్యవహరిస్తుంటాను. అన్ని విధాలుగా నన్నునేను సంరక్షించుకుంటుంటాను. కేవలం వైరల్ ఫీవర్ తోనే ఇబ్బంది పడుతున్నా నన్ను ఇబ్బంది పెట్టడానికి బాగా ప్రయత్నించారు.
ఒక వేళ మీరు మానసిక సమస్యలతో ఇబ్బంది పడితే స్పెషలిస్ట్ డాక్టర్లని సంప్రదించండి` అంటూ తనపై వార్తలని వైరల్ చేసిన వారికి శృతిహాసన్ గట్టి కౌంటర్ ఇచ్చేసింది. రీసెంట్ గా ఒంగోలులో జరిగిన `వీర సింహారెడ్డి` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న శృతిహాసన్ ఆ తరువాత వైజాగ్ లో జరిగిన చిరు `వాల్తేరు వీరయ్య` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం కనిపించలేదు. దీంతో శృతిహాసన్ పై పలు రకాల వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ వార్తలపై తాజాగా శృతిహాసన్ కౌంటర్ ఇవ్వడం గమనార్హం.