సీనియ‌ర్లకు ఎడా పెడా సంత‌కాలేల శ్రుతీ!

Update: 2022-01-07 02:30 GMT
క్రాక్- వ‌కీల్ సాబ్ చిత్రాల‌తో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుంది శ్రుతిహాస‌న్. కంబ్యాక్ అద‌ర‌గొట్టేసింది కాబ‌ట్టి ఇప్పుడు వ‌రుస‌గా అగ్ర హీరోల సినిమాల‌కు క‌మిట‌వుతూ బిజీగా ఉంది.

ఇంత‌కుముందే...స‌లార్ లాంటి పాన్-ఇండియా ప్రాజెక్ట్ తో హాట్ టాపిక్ అయ్యింది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది ల‌క్కీగా.  ప‌నిలో ప‌నిగా ఇటీవ‌ల వ‌రుస‌గా వెట‌ర‌న్ హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు సంత‌కాలు చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఇటీవ‌ల తన తండ్రి కమల్ హాసన్ కు సమకాలీనులైన హీరోల‌కు శ్రుతి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం అభిమానుల‌ను షాక్ కి గురి చేస్తోంది. బాలకృష్ణ సరసన #ఎన్‌.బి.కే107 చిత్రానికి సంతకం చేసింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన ఓ సినిమాకు సంత‌కం చేస్తోంద‌ని స‌మాచారం. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ సినిమా కోసం శ్రుతితో చ‌ర్చ‌లు సాగిస్తున్నార‌ని తెలిసింది. ఇప్ప‌టికి వాల్టేర్ వీర‌న్న - వాల్టేర్ శీను లాంటి టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. ఇది మెగాస్టార్ కెరీర్ లో మ‌రో ముఠామేస్త్రి- రౌడీ అల్లుడు త‌ర‌హా చిత్ర‌మ‌వుతుంద‌ని ఇంత‌కుముందే బాబీ వెల్ల‌డించారు.

ఒక మెగాభిమాని రియ‌ల్ స్టోరీనే బాబి తెరపైకి తెస్తున్నాడ‌న్న టాక్ కూడా ఉంది. ఇక‌పోతే శ్రుతిహాస‌న్ ఉన్న‌ట్టుండి సీనియ‌ర్ హీరోల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం చూస్తుంటే ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. శ్రుతి వేగంగా డ‌బ్బు సంపాదించాల‌నుకుంటోంద‌ని .. కెరీర్ ప‌రంగా అవ‌కాశాలు త‌గ్గిపోయే ప్ర‌మాదం ఉన్నందున జాగ్ర‌త్త‌గా ఉంద‌ని కూడా భావిస్తున్నారు. అన్న‌ట్టు క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో తాను తీవ్రంగా న‌ష్ట‌పోయాన‌ని .. ముంబైలో ఫ్లాట్ కొని భారీగా ఈఎంఐ క‌డుతుంటే క‌రోనా త‌న ఆదాయానికి గండి కొట్టింద‌ని శ్రుతి హాస‌న్ వాపోయింది. త‌న‌కు డ‌బ్బు అవ‌స‌రం చాలా ఉంద‌ని కూడా అంది. అందుకే ఇప్పుడిలా ఎడా పెడా సంత‌కాలు చేస్తూ నాలుగు చేతులా ఆర్జిస్తోంది. అన్న‌ట్టు ముంబై ఫ్లాటు ఈఎంఐలు టోట‌ల్ గా క్లియ‌ర్ చేసిందో లేదో కానీ త‌న నుంచే ఆన్స‌ర్ వ‌స్తుందేమో చూడాలి.
Tags:    

Similar News