'శ్యామ్ సింగ రాయ్' 17 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌

Update: 2022-01-11 17:30 GMT
నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన చిత్రం `శ్యామ్ సింగ రాయ్‌`. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 24న నాలుగు భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ ని సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. రాహుల్ సంక్రీత్య‌న్‌, కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రం థ‌ర్డ్ వీకెండ్ కి త‌న జోరు కాస్త త‌గ్గించింది. మూడ‌వ వారం ఎంట‌రైన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా 22.48 కోట్ల షేర్‌ని రాబ‌ట్టింది.

దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎబౌయావ‌రేజ్ మూవీగా నిలిచింది. నాని న‌టించిన గత చిత్రం `గ్యాంగ్ లీడ‌ర్‌`తో పోలిస్తే ఈ మూవీ మంచి వ‌సూళ్ల‌నే రాబ‌ట్టింది. వీకెండ్స్ లో మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన `శ్యామ్ సింగ రాయ్‌` వీక్ డేస్ లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. అంతే కాకుండా ఏపీలో టిక్కెట్ రేట్ల‌ని త‌గ్గించ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కు థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి.

దీంతో నిర్మాతే స్వ‌యంగా ఈ మూవీని ఓన్ రిలీజ్ చేశారు. దీంతో బ‌య్య‌ర్లు కొంత వ‌ర‌కు సేఫ్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. యుఎస్‌లో 815 వేల డాలర్ల‌ గ్రాస్ ని రాబ‌ట్టింది. ఇక ఈ మూవీ 17 రోజుల్లో సాధించిన వ‌ర‌ల్డ్ వైడ్ షేర్స్ ఇలా వున్నాయి.

నైజామ్ : 8 కోట్లు, సీడెడ్ : 2.40 కోట్లు, ఉత్త‌రాంధ్ర : 2.10 కోట్లు, గుంటూరు : 1.25 కోట్లు, ఈస్ట్ గోదావ‌రి : 1.05 కోట్లు, వెస్ట్ గోదావ‌రి : 0.90 కోట్లు, కృష్ణా : 1.03 కోట్లు, నెల్లూరు : 0.65 కోట్లు, రెస్టాఫ్ ఇండియా : 1.70 కోట్లు, ఓవ‌ర్సీస్ : 3.40 కోట్లు, టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ 22.48 కోట్లు వ‌సూలు చేసింది. అయితే ఈ మొత్తాన్ని బ‌ట్టి చూస్తే `శ్యామ్ సింగ రాయ్‌` ఎబౌ యావ‌రేజ్ మూవీగా మాత్ర‌మే నిలిచింద‌ని చెబుతున్నారు.


Tags:    

Similar News