నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ విడుదలకు సిద్దం అయ్యింది. ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకీర్త్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పూర్వ జన్మల నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందని మొదటి నుండి చెబుతూ వచ్చారు. అన్నట్లుగానే రెండు జనరేషన్ లను టీజర్ లో చూపించారు. నాని వింటేజ్ లుక్ లో అదరగొట్టాడు. పశ్చిమ బెంగాల్ లోని ఒక ప్రాంతంలో మహిళలపై జరుగుతున్న అత్యంత దారుణమైన అకృత్యాలను జర్నలిస్ట్ గా హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది బెంగాల్ ఎపిసోడ్ లో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ లోనే సాయి పల్లవి కనిపించబోతుంది. ఇక మరో నాని యంగ్ జనరేషన్. అతడు కూడా జర్నలిస్ట్ గానే కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
తాజాగా విడుదల అయిన టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. టీజర్ లో విజువల్స్ మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉన్నాయి. ఇక నాని చెప్పిన బెంగాళి స్త్రీ యొక్క గొప్పతనం డైలాగ్ మరియు చివర్లో కృతి శెట్టి పెట్టిన లిప్ లాక్ షాట్ తో టీజర్ ను లూప్ లో పెట్టుకుని మరీ చూస్తున్నారు. నాని బెంగాలి పాత్రలో చాలా పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడు. టీజర్ విడుదల తర్వాత సినిమా స్థాయి ఎక్కడికో వెళ్లింది. టీజర్ కు ప్రస్తుతం మంచి స్పందన దక్కుతోంది. యూట్యూబ్ ఇండియాలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఈ టీజర్ కు 6.4 మిలియన్ ల వ్యూస్ దక్కాయి. 24 గంటల్లోపే ఇంత భారీ వ్యూస్ దక్కించుకోవడం చాలా పెద్ద విషయం అంటూ మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. రెండున్నర లక్షలకు పైగా లైక్స్ ను కూడా ఈ టీజర్ యూట్యూబ్ లో దక్కించుకుంది.
నాని కి జోడీగా సాయి పల్లవి మరియు కృతి శెట్టిలు నటిస్తుండగా కీలక పాత్రలో మడోనా సెబాస్టియన్ కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తో నాని కెరీర్ బెస్ట్ ను అందుకోబోతున్నట్లుగా అభిమానులు నమ్మకంగా ఉన్నారు. సినిమా వసూళ్ల విషయంలోనే కాకుండా నాని నటన మరియు నేపథ్యం.. కథ.. ఇలా ప్రతి ఒక్కటి కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకునే విధంగా ఉంటాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. నాని ఈ సినిమాను డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇదే. ఒకే సినిమా అనుభవం ఉన్న రాహుల్ సంకీర్త్యన్ ఇంత భారీ సినిమాను తీయడం అంటే చాలా గొప్ప విషయం. అతడు ఇండస్ట్రీలో ముందు ముందు మంచి దర్శకుడిగా పేరు దక్కించుకుంటాడనిపిస్తుంది.