ఎగసి ఎగసిపడు అలజడి వాడే

Update: 2022-01-01 13:30 GMT
నేచుర‌ల్ స్టార్ నాని ద్విపాత్రాభిన‌యం చేసిన చిత్రం `శ్యామ్ సింగ రాయ్‌`. రాహుల్ సంక్రీత్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. టైమ్ ట్రావెల్ వంటి విభిన్న‌మైన క‌థ‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. సాయి ప‌ల్ల‌వి, కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్ లుగా న‌టించిన ఈ చిత్రం ఈ నెల 24న నాలుగు భాషల్లో ప్ర‌పంచ వ్యాప‌క్తంగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధిస్తోంది. ఫ‌స్ట్ వీక్ లో 36.28 కోట్లు వ‌సూలు చేసి నాని న‌టించిన చిత్రాల్లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది.

`పుష్ప ది రైజ్` బ‌రిలో వున్నా నాని సినిమాపై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది. కార‌ణం నాని సినిమా అంటే అస‌లు పోటీ అనేదే క‌నిపించ‌దు. బాక్సాఫీస్ వ‌ద్ద అత‌నికి వుండే ప్రేక్ష‌కులు అత‌నికి వున్నారు. దీంతో ఎప్పుడు నాని సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చానా.. ఆ స‌మ‌యంలో ఎలాంటి స్టార్ సినిమా వున్నా నాని సినిమాపై ఎలాంటి ప్ర‌భావం వుండ‌దు. అలాగే `శ్యామ్ సింగ రాయ్‌` చిత్రానికి కూడా ఎలాంటి ఇబ్బంది త‌లెత్త‌లేదనే చెప్పాలి.

ఈ నేప‌థ్యంలో తన వ‌ర్గం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ కూల్ గా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌ని రాబ‌ట్టుకుంటున్న `శ్యామ్ సింగ రాయ్‌` నుంచి న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా `రైజ్ ఆఫ్ శ్యామ్ సింగ రాయ్` ఫుల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఎగసి ఎగసిపడు అలజడి వాడే... తిరగబడిన సంగ్రామం వాడే... అంటూ ఫుల్ వీడియో సాంగ్ ని విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ పాట‌కి యువ ర‌చ‌యిత కృష్ణ‌కాంత్ సాహిత్యాన్ని అందించారు. అనురాగ్ కుల‌క‌ర్ణి, విశాల్ ద‌ద్లానీ, సిజీ ఆల‌పించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు నాని న‌టించిన చిత్రాల‌కు పూర్తి భిన్నంగా రూపొందిన ఈ చిత్రం విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ విశేషంగా ఆక‌ట్టుకుంటూ వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. త్వ‌ర‌లో సేఫ్ జోన్ లోకి ఎంట‌ర్ కాబోతున్న ఈ మూవీ ఎలాంటి అడ్డు లేకుండ చాలా కూల్ గా ఉందుకు సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని హీరో నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ప్ర‌త్యేకంగా తిల‌కించిన విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ మూవీని #BlockBusterClassicSSR అనే హ్యాష్ ట్యాగ్ తో మేక‌ర్స్ వైర‌ల్ చేస్తున్నారు.

ప్ర‌తీ వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఖ‌చ్చితంగా ఈ హ్యాష్ ట్యాగ్ ని జ‌త చేస్తూ నెట్టింట సినిమాని వైర‌ల్ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఇప్ప‌టికే మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. అంతే కాకుండా నాని కెరీర్ లో తొలి పాన్ ఇండియా స్థాయి సినిమా ఇదే కావ‌డం విశేషం.




Tags:    

Similar News