పాపులర్ బుల్లితెర యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డిని రాయ్ దుర్గ్(హైదరాబాద్) పోలీసులు అరెస్ట్ చేశారు. కోటి రూపాయల మేర మోసం చేశాడని మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు నరసింహారెడ్డి తనకు భయంకరమైన పరిణామాలు ఉంటాయని బెదిరించాడని ఆమె ఆరోపించారు. అరెస్ట్ అనంతరం నరసింహారెడ్డి ని రిమాండ్ కి పంపారు. ఈ కేసులో మరో మహిళను కూడా అరెస్టు చేశారు. ఆమె వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
భర్త అరెస్టుపై శ్యామల తాజాగా స్పందిస్తూ నిజం బయటకు రానివ్వండి అని అన్నారు. మేం నా అత్తగారి ఊరి నుండి హైదరాబాద్ చేరుకున్నాం. బాగా అలసిపోయాను. నాకు కొంత జ్వరం కూడా ఉంది. కాబట్టి నేను నిద్రపోయాను. నా భర్త సోమవారం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతను తన పనిలో తాను వెళ్లారని అనుకున్నాను. తరువాత మోసం కేసులో అతన్ని అరెస్టు చేసినట్లు మీడియా ద్వారా తెలుసుకున్నాను`` అని అన్నారు.
``నా భర్త గురించి నాకు తెలుసు. మాకు పెళ్లయి పదేళ్లయ్యింది. అతను మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తి కాదు`` అని మద్ధతు పలికారు. సమస్య ఏంటో తనకు తెలీదని.. ప్రాథమిక విషయాలతో ఒక నిర్ధారణ వచ్చి తన భర్తను తప్పుగా చూడొద్దని మీడియాను కోరారు. పోలీసులు పూర్తి దర్యాప్తు చేయనివ్వండి. నిజం బయటకు రావనివ్వండి అని శ్యామల అన్నారు.