అర్రెరే.. సిద్దూ హర్టయ్యాడంటగా..

Update: 2015-03-17 07:30 GMT
తెలుగులో డబ్బింగ్‌ చెప్పడానికి నిర్మాతలను ఏడిపించుకు తింటున్నాడంటా.. అని చాలాకాలం నుండి హీరో సిద్దార్ద్‌ గురించి మ్యాటర్‌ ప్రచారంలో ఉంది. దానికితోడు నిజంగానే మనోడు అప్పట్లో 'ఉదయం' అనే సినిమా కోసం డబ్బింగ్‌ చెప్పడానికి నానా తంటాలు పెట్టాడు. తెలుగులో సినిమాను ప్రమోట్‌ కూడా చేయలేదు సరిగ్గా. ఇకపోతే తాజాగా బాబు తమిళంలో రెండు హిట్లు కొట్టేసరికి, ఇక ఇప్పుడు తన గురించి రాస్తున్న తెలుగు మీడియాలను కామెడీ చేస్తున్నాడు.

        జిగర్‌తాండా, ఎనక్కుల్‌ ఒరువన్‌.. సినిమాలు రెండూ హిట్టవ్వడంతో ఇక తమిళంలో తనకు తిరుగులేదు అంటున్న సిద్దూ.. ఎప్పుడో 2013లో వచ్చిన జిగర్‌తాండా సినిమాను ఇప్పుడు ''దిల్‌రాజు.. దమ్ముంటే కాస్కో'' అనే పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మనోడు డబ్బింగ్‌ చెప్పకపోవడం వలనే సినిమా ఇంత లేటయ్యిందని న్యూస్‌ ఒకవైపు, అసలు దిల్‌రాజు పేరును అలా టైటిల్‌గా పెట్టడమేంటి అని మరోవైపు తెగ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక దిల్‌రాజు పేరును ఎందుకు పెట్టాడో చెప్పలేదు కాని, నేను 10 నెలల క్రితమే డబ్బింగ్‌ చెప్పాను.. తెలుగు మీడియాలు ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నాయి.. అంటూ తన వేదనను చెప్పుకొచ్చాడు. అర్రెరే బాబు హర్టయ్యారనమాట. కరక్టే బాబూ.. కాని మీరు ఏనాడైనా జర్నలిస్టులకు అడిగిన ప్రశ్నలకు క్లారిటీ ఇస్తే కదా.. మీకు అడిగిన వెంటనే వారు ఆన్సర్‌ చెప్పడానికి.

Tags:    

Similar News