చాక్లెట్ బోయ్ - లవర్ బోయ్ సిద్ధార్థ్ ఏమైపోయాడు? ప‌్రస్తుతం అతడి సీన్ ఏంటి? టాలీవుడ్ లో అతడికి మార్కెట్ ఉందా? లేదా? ఎందుకని అతడు ఉన్నట్టుండి అదృశ్యమైపోయాడు? ఎందుకు పూర్తిగా తమిళ ఇండస్ర్టీకే పరిమితమైపోయాడు? తెలుగులో ఓ రేంజులో వెలుగులు విరజిమ్మిన హీరో ఇలా అయిపోయాడేంటి? ఇలాంటి సందేహాలెన్నో ఉన్నాయి మన జనాలకు. ముఖ్యంగా సిద్ధార్థ్ అభిమానులకు ఇవన్నీ సమాధానం లేని డౌట్సే.
అయితే వీటన్నిటికీ సమాధానం ఉంది. ఇదంతా సిద్ధార్థ్ స్వయం కృతమేనని చెప్పుకోవాలి. అతడు సరైన టైమింగుతో సరైన ఎంపికలు చేసుకోకపోవడం వల్లనే దెబ్బతిన్నాడిక్కడ. కొన్ని కాంట్రవర్శీల్లో వేలు పెట్టడం వల్ల కూడా సిద్ధూ కెరీర్ పై అనూహ్యంగా ప్రభావం చూపించింది. ముఖ్యంగా సక్సెస్ పోరులో అతడు అపరాధి అయిపోయాడు. గెలుపు గుర్రం ఎక్కలేకపోయాడు. లేదంటే ఈ పాటికే అతడు ఇంతవరకూ ఏ తమిళ హీరోకి లేనంత రేంజు తెలుగులో చూసి ఉండేవాడే. అంతా స్వయం కృతం. రీజన్ ఏదైనా ఇప్పటికీ అతడిపై తెలుగు ప్రేక్షకులకు సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇక్కడ తనకి ఫ్యాన్ బేస్ పెద్దదే. కాకపోతే హిట్టొచ్చి ఆ హిట్టుతో పాటే మార్కెట్ లో హవా మొదలైతేనే రేంజు పెంచుకోగలిగినట్టు. కానీ ఆ ఒక్కటీ దక్కడం లేదు.
తమిళంలో తన అభిరుచికి తగ్గట్టే విలక్షణమైన కథలెన్నో ఎంపిక చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద విజయాలు అందుకుంటున్నా.. తెలుగులో మాత్రం పప్పులుడకడం లేదు. అందుకే ఈసారి పంథా మార్చి ఓ హారర్ సినిమాతో వస్తున్నాడు. అయితే ఇందులో అతడిని కథానాయికలే రక్షించాల్సి ఉంది. చంద్రకళ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీలో త్రిష ప్రధాన పాత్రధారి. హన్సిక కూడా కీలకపాత్రధారి. ఈ ఇద్దరి చుట్టూనే సినిమా తిరుగుతుంది. సిద్ధూ ఓ సపోర్టింగ్ క్యారెక్టర్ మాత్రమే. ఆరణ్మయి-2 గా తమిళ్‌లో రిలీజవుతున్న ఈ సినిమా ఈనెల 29న తెలుగులో కూడా రిలీజవుతోంది. మొత్తానికి ఇప్పుడు సిద్ధూ లేడీస్ పై ఆధారపడినట్టే!