ఒక్క ఆస్కార్ అంటూ దశాబ్దాలుగా ఇండియన్ సినిమా లెజెండ్స్ ఎందరో ప్రయత్నాలు చేస్తున్నారు. మన సినిమాలకు ఎలాంటి అవార్డులు రాకున్నా బ్రిటిష్ ఫిలిం మేకర్ డానీ బోయెల్ తీసిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’కు ఏఆర్ రెహమాన్ - రసూల్ పొకుట్టి అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు ఇంకో ఇండియన్, అది కూడా ఓ తెలుగు కుర్రాడు ఆస్కార్ రేసులో నిలవడం విశేషమే. ఆ కుర్రాడి పేరు సిద్ధార్థ మాగంటి.
హాలీవుడ్ దర్శకుడు డాన్ లాండ్ రూపొందించిన ‘అరియా ఫర్ ఏ కౌ’ అనే షార్ట్ ఫిల్మ్ ప్రస్తుతం ఆస్కార్ షార్ట్ ఫిలిమ్స్ కేటగిరీలో పోటీకి ఎంపికైంది. మొత్తం 60 చిత్రాలు రేసులో ఉన్నాయి. వీటిని షార్ట్ లిస్ట్ చేసి.. ఆ తర్వాత చివరగా ఓ సినిమాకు అవార్డు అందిస్తారు. ‘అరియా ఫర్ ఏ కౌ’ ఇప్పటికే కొన్ని చిత్రోత్సవాల్లో అవార్డులందుకున్న నేపథ్యంలో ఆస్కార్ వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు.
ఈ సినిమాను సిద్ధార్థ అన్నీ తానై నడిపించడం విశేషం. ఫోటోగ్రఫీ - ఎడిటింగ్ - వీఎఫ్ ఎక్స్ - సౌండ్ మిక్సింగ్.. ఇలా టెక్నికల్ గా అన్ని బాధ్యతలనూ తనపై వేసుకొని సిద్ధార్థ ఈ సినిమాను పూర్తి చేశాడు. అమెరికాలో విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన కోర్సు చేసిన సిద్ధార్థ్ హాలీవుడ్ టాప్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పని చేశాడు.