దక్షిణాది చిత్ర పరిశ్రమలో 'సైమా' అవార్డులను (SIIMA - సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. ప్రతీ ఏదైనా అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలను.. కరోనా వైరస్ నేపథ్యంలో గత మూడేళ్లుగా నిర్వహించలేదు. అయితే 2019 సంవత్సరానికి సంబంధించిన ‘సైమా’ అవార్డులను ఈ ఏడాది ప్రధానం చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. ‘SIIMA’ ఛైర్ పర్సన్ బృందా ప్రసాద్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ.. వచ్చే సెప్టెంబర్ లో పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో 2019 సంవత్సరానికి గానూ వివిధ కేటగిరీలలో నామినేట్ అయిన మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాను ప్రకటించారు. ఇందులో 'మహర్షి' (తెలుగు) - 'అసురన్' (తమిళం) - 'యజమానా' (కన్నడ) - 'కుంబలంగి నైట్స్' (మలయాళం) చిత్రాలు SIIMA నామినేషన్ లలో ముందున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' మూవీ 10 విభాగాల్లో నామినేట్ అయింది. బెస్ట్ ఫిలిం - బెస్ట్ డైరెక్టర్ - బెస్ట్ యాక్టర్ - బెస్ట్ యాక్ట్రెస్ - బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - బెస్ట్ లిరిసిస్ట్ - బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) - బెస్ట్ విలన్ - బెస్ట్ సినిమాటోగ్రాఫర్ కేటగిరీలలో నేషనల్ అవార్డ్ ఫిల్మ్ 'మహర్షి' నామినేట్ అయింది.
అలానే యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య - సమంత హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ తెరకెక్కించిన ''మజిలీ'' మూవీ 9 విభాగాల్లో నామినేషన్ పొంది తెలుగు చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఇక నాని - గౌతమ్ తిన్నూరి ల ''జెర్సీ'' సినిమా 7 కేటగిరీలలో నామినేట్ అయింది. తమిళంలో ధనుష్ నటించిన 'అసురన్' చిత్రం 10 నామినేషన్లు.. కార్తీ నటించిన 'ఖైదీ' సినిమా 8 విభాగాల్లో నామినెట్ అయింది. మలయాళంలో ఫహద్ ఫాజిల్ నటించిన 'కుంబళంగి నైట్స్' ఏకంగా 13 కేటగిరీలలో నామినేట్ అవడం గమనార్హం. కన్నడ 'యజమాన' సినిమా 12 నామినేషన్లు పొందింది.
SIIMA - (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) విన్నర్ ని ఆన్ లైన్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా నిర్ణయించనుంది. www.siima.in వెబ్ సైట్ తో పాటుగా SIIMA ఫేస్ బుక్ పేజీ ద్వారా ఆడియన్స్ తమ ఓట్ల ద్వారా విజేతలను నిర్ణయించవచ్చు. మరి ఈసారి అత్యధికంగా ఏ చిత్రం అవార్డులు అందుకుంటుందో చూడాలి.