సైమా అవార్డ్స్-2021: 'బెస్ట్ హీరో' గా సూపర్ స్టార్ మహేష్ బాబు..!

Update: 2021-09-19 03:38 GMT
దక్షిణాది చిత్ర పరిశ్రమలో 'సైమా' అవార్డులను (SIIMA - సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. ప్రతీ  ఏడాది అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలను.. కరోనా వైరస్ నేపథ్యంలో గత మూడేళ్లుగా నిర్వహించలేదు. అయితేపరిస్థితులు సానుకూలంగా ఉండటంతో 2019 సంవత్సరానికి సంబంధించిన ‘సైమా’ అవార్డులను ఈ ఏడాది ప్రధానం చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. హైదరాబాద్ లో జరుగుతోన్న ఈ అవార్డుల వేడుకకు సౌత్ స్టార్స్ అందరూ హాజరై సందడి చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు 'సైమా' వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో కలిసి మహేష్ ఈ అవార్డ్ ఫంక్షన్ కు వచ్చారు. ఇందులో మహేష్ కూల్ అండ్ స్టైలిష్ గా ఉన్నారు. మహేష్ - వంశీ కాంబోలో వచ్చిన 'మహర్షి' సినిమా సైమా లో 10 విభాగాల్లో నామినేట్ అయింది. బెస్ట్ ఫిలిం - బెస్ట్ డైరెక్టర్ - బెస్ట్ యాక్టర్ - బెస్ట్ యాక్ట్రెస్ - బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - బెస్ట్ లిరిసిస్ట్ - బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) - బెస్ట్ విలన్ - బెస్ట్ సినిమాటోగ్రాఫర్ కేటగిరీలలో నేషనల్ అవార్డ్ ఫిల్మ్ 'మహర్షి' నామినేట్ అయింది.

అయితే 'మహర్షి' చిత్రానికి గానూ మహేష్ బాబు #ఉత్తమ నటుడు' గా అవార్డ్ కు ఎంపిక అయ్యారు. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ చేతుల మీదుగా మహేష్ ఈ అవార్డ్ అందుకున్నారు. బెస్ట్ డైరెక్టర్ గా వంశీ పైడిపల్లి అవార్డు గెలుపొందారు. మొత్తం మీద 'మహర్షి' చిత్రానికి వివిధ విభాగాల్లో ఐదు అవార్డ్స్ వరించినట్లు తెలుస్తోంది. 2019వ సంవత్సరానికి గానూ SIIMA విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

సైమా అవార్డ్స్-2019 (తెలుగు) విజేతలు:

*ఉత్తమ చిత్రం: జెర్సీ (సితార ఎంటర్టైన్మెంట్స్)
*ఉత్తమ వినోదాత్మక చిత్రం: ఎఫ్2 (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
*ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (మహర్షి)
*ఉత్తమ నటుడు: మహేష్ బాబు (మహర్షి)
*ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నాని (జెర్సీ)
*ఉత్తమ నటి: సమంత (ఓ బేబీ)
*ఉత్తమ నటి (క్రిటిక్స్): రష్మికా మందన్న (డియర్ కామ్రేడ్)
*ఉత్తమ సహాయ నటుడు: అల్లరి నరేష్ (మహర్షి)
*ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ (ఓ బేబీ)
*ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి)
*ఉత్తమ గేయ రచయిత: శ్రీమణి (ఇదే కదా.. మహర్షి)
*ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి (ఇస్మార్ట్ శంకర్-టైటిల్ సాంగ్)
*ఉత్తమ గాయని: చిన్మయి (ప్రియతమా.. మజిలీ)
*ఉత్తమ విలన్: కార్తికేయ గుమ్మకొండ (గ్యాంగ్ లీడర్)
*ఉత్తమ తొలి పరిచయ హీరో: శ్రీ సింహా (మత్తు వదలరా)
*ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్: శివాత్మిక రాజశేఖర్ (దొరసాని)
*ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు: స్వరూప్ ఆర్ఎస్జె (ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ)
*ఉత్త తొలి పరిచయ నిర్మాత: స్టూడియో 99 (మల్లేశం)
*ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సానూ వర్గీస్ (జెర్సీ)
*ఉత్తమ కమెడియన్: అజయ్ ఘోష్ (రాజు గారి గది 3)
Tags:    

Similar News