ఈరోజు ఉదయం నుండి ఒక ప్రచారం బాగా ఊపందుకుంది. అదేంటంటే.. సైమా అవార్డుల ఆన్ లైన్ వెబ్ సైట్లో ఓటింగ్ విషయంలో ఏదో తేడా జరిగిందట. మొన్నటివరకు సైమ తెలుగు 2016 అవార్డుల్లో ఉత్తమ నటుడిగా మహేష్ బాబు అండ్ ప్రబాస్ కు చెరో 40% ఓట్లు వస్తే.. అల్లు అర్జున్ కు కేవలం 11% ఓట్లు మాత్రమే వచ్చాయట. అయితే గత రాత్రి మాత్రం ఓ మిరాకిల్ జరిగింది అంటున్నారు కొందరు సినిమా లవర్స్.
రాత్రికి రాత్రే.. అల్లు అర్జున్ కు ఏకంగా 30,000 ఓట్లు వచ్చి పడ్డాయట. ఆ దెబ్బతో 80% మంది బన్నీకే ఓటేసినంత పనైంది. శ్రీమంతుడులో మహేష్ కంటే.. బాహుబలిలో ప్రభాస్ కంటే.. రుద్రమదేవి సినిమాలో బన్నీ ఏమంత గొప్పగా చేశాడని అందరూ కామెంట్లు చేయడంతో.. అసలు ఒక్క రాత్రిలో అన్నేసి ఓట్లు ఎలా వచ్చాయి అని చెక్ చేసిన సైమా బోర్డు.. వెంటనే ఆ 30వేల ఓట్లను రద్దు చేసిందని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఈ పని నిజంగానే ఎవరైనా బన్నీ మీద ప్రేమతో చేశారా? లేకపోతే బన్నీకి బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి చేశారా? అనే విషయం మాత్రం తెలియదు.
అయితే అఫీషియల్ గా సైమా వారు ఏదో టెక్నికల్ గ్లిట్చ్ చోటుచేసుకుందనో.. లేకపోతే ఎవరో తమ ప్రోగ్రామ్ ను హ్యాక్ చేసి ఫేక్ ఓట్లు వేశారనో చెప్పనేలేదు. పైగా సైమా వారు క్రియేట్ చేసిన వెబ్ సైట్ చాలా స్టాండర్డ్ అండ్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫాలో అయ్యి చేసింది కాబట్టి.. ఇదంతా కేవలం ఎవరో పుట్టించిన రూమర్ అనే అనుకోవాలేమో. కేవలం బన్నీకి బ్యాడ్ నేమ్ తీసుకురావడానికే ఇలా చేస్తున్నారు అనే ఆరోపణ కూడా ఉంది.