వరుస వివాదాలు.. నిందలు.. గొడవలు .. గందరగోళం.. వ్యక్తిగత జీవితంలో ప్రేమ వైఫల్యం.. ఇన్నిటిని ఎదుర్కొన్నాడు తమిళ స్టార్ హీరో శింబు. రజనీకాంత్ .. అజిత్ .. సూర్య లాంటి స్టార్లకు ఏమాత్రం తీసిపోని ప్రతిభావంతుడగా గుర్తింపు తెచ్చుకుని మరీ క్రమశిక్షణా రాహిత్యంతో కెరీర్ ని నాశనం చేసుకున్న హీరోగా అతడి గురించి అభిమానుల్లో చర్చ సాగుతుంటుంది. అయితే అదంతా గతం గతః. వర్తమానం ఏమిటి? అన్నదే ఇంపార్టెంట్. పడి లేచే కెరటానికి అలాంటివేవీ లెక్కే ఉండదు.
అందుకే కంబ్యాక్ కోసం శింబు తపిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. యంగ్ హీరో కంబ్యాక్ లో వైవిధ్యంతో ఆకట్టుకుంటున్నాడు. శిలాంబరసన్ అకా శింబు ప్రతీకారంతో తిరిగి వస్తున్నారు అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
శింబు నటిస్తున్న తాజా సినిమా కొత్త లుక్ లు ఆద్యంతం ఉత్సుకతను పెంచాయి. శింబు ఈసారి ప్రామిస్సింగ్ పాత్రలో నటిస్తున్నారని అర్థమైంది. శింబు తెలుగులో బ్లాక్ బస్టర్ కొట్టి ఇప్పటికే దశాబ్ధం అవుతోంది. మరోసారి అలాంటి బ్లాక్ బస్టర్ తో రీఎంట్రీ ఇస్తాడనే భావిస్తున్నారు.
పరిశ్రమ అగ్ర దర్శకులతో కలిసి పని చేసిన శింబు వివాదాల వల్లనే బ్యాడ్ అయ్యాడు కానీ.. ప్రతిభ పరంగా వేలెత్తి చూపించే సాహసం చేయలేరు ఎవరూ. గౌతమ్ మీనన్ తో రెండుసార్లు పని చేశాడు. మణిరత్నంతో కలిసి పనిచేశాడు. కానీ అతడికి సరైన మార్గం ఇటీవల చిక్కడం లేదు. తప్పొప్పులు తెలుసుకోవడంలో తడబాటు వల్లనే ఇలా అయ్యిందేమో!
ఎట్టకేలకు తప్పుల్ని తెలుసుకుని శింబు సింగంలా మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నాడని తాజా ప్రయత్నం చెబుతోంది. ఎట్టిపరిస్థితిలో బ్లాక్ బస్టర్ తో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడని అర్థమవుతోంది.
ఇప్పటికే తన శరీరాన్ని పూర్తిగా మార్చాడు. లుక్ మారింది. తాజా చిత్రంలో శింబు రెండు విభిన్నమైన పాత్రలతో వస్తున్నారు. మొదటిది ఈశ్వరన్.. రెండవది మానాడు. ఈ రెండు చిత్రాల్లో ఎంతో వైవిధ్యంగా కనిపించనున్నాడు. నిన్న రిలీజైన మానాడు పోస్టర్లు ఆద్యంతం ఉత్కంఠను పెంచాయి. తాజా పరిణామంతో.. ప్రతిభావంతుడు అయిన శింబు కసి ప్రతీకారం తీర్చుకునేందుకు బరిలో దిగాడని అభిమానులు విశ్లేషిస్తున్నారు.