టెంపర్ రీమేక్ వెనక ఇంత కథుందా!!

Update: 2016-03-19 07:08 GMT
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే స్పెషల్ గా నిలిచిపోయే చిత్రం పూరీ జగన్నాధ్ తీసిన టెంపర్. ఈ మూవీని కోలీవుడ్ లో రీమేక్ చేసేందుకు రంగం సిద్ధం కాగా.. దీనికి సంబంధించి మాత్రం బోలెడంత హై డ్రామా నడిచింది. ఈ మూవీలో హీరో విషయంపైనే ఎక్కువ డ్రామా నడవడం విశేషం. శింబు హీరోగా టెంపర్ రీమేక్  చేసేందుకు నిర్ణయించారనే వార్తలొచ్చాయి.

విజయ్ చందర్ దర్శకత్వం ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా శుక్రవారం ఉదయం జరిగిపోయాయి. ఇంతలో ఏం జరిగిందో కానీ.. గంటల టైం లోనే టెంపర్ రీమేక్ లో విశాల్ నటించనున్నట్లు అనౌన్స్ మెంట్ వచ్చింది. 'తెలుగు టెంపర్ కి నిర్మాత బండ్ల గణేష్. తమిళ్ రీమేక్ ని నేను గణేష్ తో కలిసి నిర్మిస్తున్నా. విశాల్  హీరోగా చేస్తుండగా.. ఇతర నటీనటులను త్వరలో ప్రకటిస్తాం. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది' అని చెప్పాడు నిర్మాత మధు. అయితే... శింబు హీరోగా రీమేక్ తీద్దామని భావించిన నిర్మాత మైకేల్ రాయప్పన్ వెర్షన్ వేరేగా ఉంది.

'శింబు-విజయ్ చందర్ ల కాంబినేషన్ లో సినిమా తీస్తున్నాం. ఇందుకోసం రెండు మూడు సబ్జెక్టులు అనుకున్నాం. అందులో టెంపర్ రీమేక్ కూడా ఒకటి. అంతే తప్ప దీన్ని ఫైనల్ చేయలేదు. విజయ్ చందర్ సొంత స్టోరీతో కూడా చేసే యోచన ఉంది. మరికొన్ని రీమేక్స్ కూడా పరిశీలిస్తున్నాం. ఇప్పుడు టెంపర్ ని వేరే వాళ్లు రీమేక్ చేస్తుంటే.. మేం ఇంకో సబ్జెక్ట్ చూసుకుంటాం' అని చెప్పాడు రాయప్పన్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ గా కాజల్ నే ప్రిఫర్ చేస్తుండడమే.
Tags:    

Similar News