మాజీ లవర్ గురించి మాట్లాడ్డానికి ఎవరూ ఇష్టపడరు. కానీ శింబు, నయనతార బ్రేకప్ తర్వాత మళ్లీ కలిసి ఓ సినిమా చేశారు. రొమాన్స్ పండించారు. ఇద్దరూ పక్కా ప్రొఫెషనల్ కాబట్టి సినిమా చేయడంలో ఆశ్చర్యమేమీ లేదనుకోవచ్చు. ఐతే శింబు ఓ అడుగు ముందుకేశాడు. తన మాజీ ప్రేయసి కొత్త ప్రేమాయణం గురించి ఓ మీడియా సమావేశంలో మొహమాటం లేకుండా స్పందించాడు. తన కొత్త సినిమా ‘వాలు’ విజయోత్సవంలో భాగంగా శింబు ప్రెస్ మీట్ పెట్టగా.. డైరెక్టర్ విఘ్నేష్ తో నయనతార ప్రేమాయణం గురించి మీరేమంటారు అంటూ శింబును సూటిగా ప్రశ్నించాడు ఓ విలేకరి. శింబు నో కామెంట్ అని తప్పించుకోకుండా దీనికి నవ్వుతూ సమాధానమివ్వడం విశేషం.
‘‘నయన్ ప్రస్తుతం ఇలాంటి రిలేషన్ షిప్ లో ఉందని నేను నమ్మడం లేదు. ఒక వేళ మీరు అన్నదే నిజమైతే ఆ విషయంలో నేను చాలా సంతోషిస్తాను. తను హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను’’ అని బదులిచ్చి ఆశ్చర్యపరిచాడు శింబు. నయన్ హీరోయిన్ గా తొలి అడుగులు వేస్తున్న సమయంలో ‘వల్లవన్’ సినిమా సందర్భంగా శింబుతో పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ ఓ రేంజిలో రొమాన్స్ చేసుకున్నారు. దాని తాలూకు ఫొటోలు, వీడియోలు నెట్ లో హల్ చల్ చేశాయి. ఐతే ఆ ఫొటోలు, వీడియోలు బయటపెట్టింది శింబునే అనే కోపంతో అతడికి నయన్ గుడ్ బై చెప్పేసిందన్న వార్తలొచ్చాయి. చాన్నాళ్లు ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఆ తర్వాత నయన్.. ప్రభుదేవాతో, శింబు.. హన్సిక తో ప్రేమాయణం సాగించారు. కానీ వాళ్లతో కూడా ఇద్దరికీ బ్రేకప్ అయింది.