తనకెంత తిక్కుందో చూపిస్తున్న తమన్

Update: 2016-07-28 04:33 GMT

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మూవీ తిక్క.. ఆగస్ట్ లో రిలీజ్ కానుండగా.. ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని ఈ నెల 30న చేయబోతున్నారు. ఈ మూవీ ఆడియోని సూపర్ హిట్ చేసి.. టాలీవుడ్ తను బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు తమన్ గట్టిగానే ట్రై చేస్తున్నాడు. తిక్క మూవీలో మ్యూజిక్ హైలైట్ అవ్వాలనేది మనోడి టార్గెట్. అందుకే పాటలతో రకరకాల ప్రయోగాలు చేసేస్తున్నాడు.

తమిళ స్టార్ హీరో శింబుతో ఓ పాట పాడించిన తమన్.. శింబుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి అసలు విషయం చెప్పేశాడు. ఇలా ఒక హీరో సినిమాలో ఇంకో భాషకి చెందిన స్టార్లతో పాడించడం తమన్ కనిపెట్టిన కొత్త స్టైల్. ఇప్పటికే తిక్క కోసం ధనుష్ తో ఓ పాట పాడించేసిన ఈ కంపోజర్.. ఇప్పుడు లేటెస్ట్ గా శింబును తీసుకొచ్చాడు. తిక్క రిలీజ్ అయ్యాక సినిమాలో హీరో తిక్క చూపిస్తాడో చెప్పలేం కానీ.. ఆ ప్రాజెక్టుతో తమన్ తన తిక్కంతా ప్రదర్శించేస్తున్నాడు. అంతే కాదు.. హీరో పేరుతో ఓ కొత్త కాన్సెప్ట్ కూడా బయటకు తీశాడు.

సాయి ధరం తేజ్ ని సింపుల్ గా చెప్పేందుకు SDT అనే లెటర్స్ వాడతారు. ఇందులో ఎస్ అంటే శింబు.. డి అంటే ధనుష్.. టి అంటే తమన్.. అంటూ కొత్త అబ్రివేషన్ ఒకటి చెప్పి.. మెగా ఫ్యాన్స్ కి హుషారు తెప్పించేశాడు.
Tags:    

Similar News