ఒక సినిమాను ప్రేక్షకుల్లో తీసుకెళ్లే విధానం ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. ఎవర్ గ్రీన్ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ మాత్రం ఈ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటుంది. తమ బ్యానర్ లో సినిమా గురించి ఆడియన్స్ లో ఎగ్జైట్ అయ్యేలా చేస్తారు.
గీతా ఆర్ట్స్ లో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంటే గీతా ఆర్ట్స్ 2 లో మీడియం బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 లో వస్తున్న సినిమా 18 పేజెస్. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీలో తమిళ స్టార్ హీరో శింబుతో ఒక సాంగ్ పాడించారు.
హీరోగానే కాదు సింగర్ గా కూడా శింబు తన మార్క్ చూపిస్తున్నాడు. రెగ్యులర్ గా కాకపోయినా ప్రత్యేకమైన పాటలు పాడుతూ వస్తున్నాడు శింబు. అంతకుముందు తన సినిమాల్లో మాత్రమే పాట పాడి తన సరదా తీర్చుకున్న శింబు ఈమధ్య బయట హీరోలకు పాట పాడుతున్నారు. లేటెస్ట్ గా నిఖిల్ 18 పేజెస్ కోసం టైం ఇవ్వు పిల్లా సాంగ్ పాడారు. ఈ సాంగ్ ఇలా రిలీజైందో లేదో అలా వైరల్ అయ్యింది. పాట అంత ఎంగేజింగ్ గా ఉండటమే కాకుండా శింబు పాడే సరికి అది మరింత క్రేజ్ తెచ్చుకుంది.
అలా 18 పేజెస్ సినిమాలో టైం ఇవ్వు పిల్లా సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ గా మారింది. కార్తికేయ 2 సెన్సేషనల్ హిట్ అందుకోగా ఆ క్రేజ్ తో నిఖిల్ 18 పేజెస్ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. నిఖిల్, అనుపమ ఇద్దరు కలిసి కార్తికేయ 2 మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చేయాలని చూస్తున్నారు.
శింబు తెలుగులో పాడిన సాంగ్స్ కి సూపర్ క్రేజ్ ఉంటుంది. ఇదివరకు మంచు మనోజ్ కోసం పోటుగాడు సినిమాలో బుజ్జి పిల్ల సాంగ్ పాడారు. ఎన్.టి.ఆర్ బాద్షా సినిమాలో కూడా డైమండ్ గర్ల్ సాంగ్ ఆలపించారు. రీసెంట్ గా రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమాలో కూడా బుల్లెట్ సాంగ్ పాడారు.
ఇప్పుడు నిఖిల్ కోసం టైం ఇవ్వు పిల్లా అని పాడారు. హీరోగా తానెంత బిజీగా ఉన్నా ఇలా తన పాట కోసం వచ్చిన తెలుగు హీరోలని నిరాశ పరచకుండా తన స్టైల్ లో పాటలు పాడేస్తున్నారు శింబు. 18 పేజెస్ సినిమాకు శింబు సాంగ్ చాలా ప్లస్ అయ్యేలా ఉంది. ఈ మూవీ కి గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో అన్ని సాంగ్స్ ఎలా ఉన్నా శింబు సాంగ్ మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

For Video>>> https://youtube.com/shorts/PqjDKMn24wg?feature=share