పాపం శింబు.. అతడి యాంటీ ఫ్యాన్స్ సైతం జాలిపడే స్థితిలో ఉన్నాడిప్పుడు. రెండున్నరేళ్లుగా అతడి సినిమా విడుదలే కాలేదు. అలాగని చేతిలో అవకాశాలు లేవేమో, ఫ్లాపుల్లో ఉన్నాడేమో అనుకుంటే పొరబాటే. అతడి చివరి సినిమా ‘పోడా పోడి’ పెద్ద హిట్టు. ఈ రెండున్నరేళ్లలో రెండు సినిమాలు పూర్తి చేసి.. ఇంకో రెండు సినిమాలు లైన్లో పెట్టాడు. కానీ ఎప్పుడో ఫస్ట్ కాపీ రెడీ అయినా వాలు, ఇదు నమ్మ ఆలు సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా వాలు సినిమా విషయంలో ఉన్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా విడుదల హక్కులు తమకున్నాయంటే తమకున్నాయంటూ కొందరు కలిసి రిలీజ్ ను ఆపేస్తున్నారు.
ఏడాది కాలంలో చాలాసార్లు రిలీజ్ డేట్ మారిన ‘వాలు’ జులై 17న రావడం పక్కా అని శింబునే స్వయంగా ప్రకటించాక కూడా రిలీజ్ సాధ్యం కాలేదు. విడుదల ఆపాలంటూ ఒకరికి ఐదుగురు కోర్టుకెక్కడంతో వాలు రిలీజ్ పై స్టే విధించింది కోర్టు. ఈ సందర్భంగా శింబు అభిమానుల ఆవేదన అంతా ఇంతా కాదు. గొడవలు చేశారు. ఆత్మహత్యాయత్నాలు చేశారు. శింబు సైతం కన్నీళ్లు పెట్టుకున్నాడు. అభిమానులు సంయమనంతో ఉండాలని వేడుకున్నాడు. ఐతే ‘వాలు’ విషయంలో కొందరు ఇండస్ట్రీ పెద్దలు ముందుకొచ్చి శింబును వివాదం నుంచి బయటపడేసే ప్రయత్నం చేశారు. కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చి.. కోర్టుకెక్కిన బ్యాచ్ కేసుల్ని ఉపసంహరించుకుంది. వివాదాలన్నీ సెటిల్ చేసుకుని ఆగస్టు 14న ‘వాలు’ రిలీజ్ చేయాలని చూస్తున్నాడు శింబు. మరి స్వాతంత్ర్య దినోత్సవం నాటికైనా ‘వాలు’కు స్వాతంత్ర్యం లభిస్తుందేమో చూడాలి.